ఆమెను చూస్తే గర్వంగా ఉంది | Sakshi
Sakshi News home page

ఆమెను చూస్తే గర్వంగా ఉంది

Published Mon, Feb 26 2024 2:44 AM

Geethanjali Malli Vacchindi release on March 22th - Sakshi

‘‘అంజలిగారి కెరీర్‌లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్‌’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు.

హీరోయిన్‌ అంజలి టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్‌. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్‌ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్‌పై కోన వెంకట్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్‌ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు.

అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్‌. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు.

Advertisement
 
Advertisement
 
Advertisement