'సోలో బాయ్' ఛాలెంజ్‌ గెలిస్తే రూ. 30 వేలు బహుమతి | Gautham Krishna Solo Boy Movie Song Out Now | Sakshi
Sakshi News home page

'సోలో బాయ్' ఛాలెంజ్‌ గెలిస్తే రూ. 30 వేలు బహుమతి

Aug 25 2024 8:39 AM | Updated on Aug 25 2024 11:24 AM

Gautham Krishna Solo Boy Movie Song Out Now

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ పై ఒక సినిమా తెరకెక్కుతుంది.   సతీష్ కుమార్ నిర్మాతగా పి. నవీన్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి 'సోలో బాయ్' టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఈ సినిమా నుంచి ఒక హుక్‌ స్టెప్‌తో మేకర్స్‌ ఛాలెంజ్‌గా విసిరారు. జుడా షాండి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ఆట సందీప్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ సోలో బాయ్ టైటిల్ సాంగ్‌ను తాజాగా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ కుమార్  మాట్లాడుతూ .. 'నన్ను సపోర్ట్ చేస్తున్న మీడియాకి ప్రత్యేక కృతజ్ఞతలు. చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా మీడియాతో పాటు  ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేసి కష్టపడి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్‌, టెక్నీషియన్‌కు కృతజ్ఞతలు. సోలో బాయ్ సాంగ్ చూసిన అందరి నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. డైరెక్టర్ నవీన్ మంచి సినిమాను అందించాడు.  నా తమ్ముడు గౌతమ్ కృష్ణ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.  గౌతమ్ ఫ్యూచర్లో కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.' అని ఆయన  అన్నారు.

సోలో బాయ్ టైటిల్ సాంగ్ హుక్ స్టెప్ చాలెంజ్ చేసిన వాళ్లకి మొదటి బహుమతిగా 30,000 రెండవ బహుమతిగా 20,000 మూడో బహుమతిగా 10,000 ఇస్తామని హీరో గౌతమ్ కృష్ణతో పాటు కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్ తెలిపారు. ఈ స్టెప్‌తో వీడియో తీసి తమ టీమ్‌ను  ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్ళ నుంచి బెస్ట్ సెలెక్ట్ చేసి మీడియా ముందే బహుమతిని ఇస్తామని పేర్కొన్నారు. టైటిల్ సాంగ్‌ను కాసర్ల శ్యామ్ రచిస్తే.. రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement