పండగ కిక్కు.. కొత్త లుక్కు 

Ganesh Chaturthi 2023: Latest Telugu Movies - Sakshi

వినాయక చవితికి వినాయకుడికి విభిన్న రకాల వంటకాలను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తుంటారు. అలాగే ఈ పండక్కి వినాయకుడిని స్మరించుకుంటూ ‘పండగ కిక్కు..కొత్త లుక్కు’ అంటూ కొందరు సినిమా యూనిట్‌ వారు పలు రకాల అప్‌డేట్స్‌ ఇచ్చారు. వీటిలో కొన్ని ఈ విధంగా..  

బీచ్‌లో సైంధవ్‌
బీచ్‌లో సేద తీరు తున్నారు వెంకటేశ్‌. ఆయన హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో రూ΄పొందుతున్న ‘సైంధవ్‌’ కొత్త పొస్టర్‌ విడుదలైంది. శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా నటిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, తమిళ నటుడు ఆర్య, బాల నటి సారా కీలక పా త్రధారులు. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 22న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్‌. 
 
వీడు టైగర్‌... 
రవితేజ టైటిల్‌ రోల్‌ చేసిన చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. స్టువర్టుపురం దొంగగా పేరు గాంచిన టైగర్‌ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నూపుర్‌ సనన్, గాయత్రీ భరద్వాజ్‌ హీరోయిన్లు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరు 20న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలోని రెండో పా ట ‘వీడు..’ను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లుగా వెల్లడించి, రవితేజ పొస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్‌. 
 
రామ్‌.. కల్ట్‌ మామా 
‘బిట్టు బిట్టు బాడీ మొత్తం రెడ్డూ చిల్లి సాల్టు..’ అంటూ సాగే పా ట ‘స్కంద’ చిత్రంలోనిది. రామ్‌ హీరోగా బోయపా టి శ్రీను దర్శకత్వంలో రూ΄పొందుతున్న చిత్రమిది. శ్రీలీల, సయీ మంజ్రేకర్‌ హీరోయిన్లు. ఈ సినిమాలో రామ్, ఊర్వశీ రౌతేలా కాంబినేషన్‌లో వచ్చే ప్రత్యేక గీతం ‘కల్ట్‌ మామా’ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. తమన్‌ స్వరపరచిన ఈ పాటను అనంత శ్రీరామ్‌ రాయగా హేమచంద్ర, రమ్య బెహ్రా, మహా పా డారు. జీ స్టూడియోస్‌ సౌత్, పవన్‌ కుమార్‌ల సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న రిలీజ్‌ కానుంది. 
 
టీజర్‌ రెడీ 
‘యానిమల్‌’ మూవీ టీజర్‌ రెడీ అవుతోంది. ఈ నెల 28న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించి, ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న రణ్‌బీర్‌ కపూర్‌ పొస్టర్‌ను విడుదల చేశారు. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌. భూషణ్‌కుమార్, క్రిషన్‌కుమార్, మురాద్‌ ఖేతాని, ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబరు 1న, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్‌ కానుంది. 


 మది దోచేసిందే...
‘మాయే చేసి మెల్లగా మది దోచేసిందే సిన్నగా...’ అంటూ  హీరో కల్యాణ్‌ రామ్‌ పా డారు. కల్యాణ్‌ రామ్, సంయుక్తా మీనన్‌ నటిస్తున్న ‘డెవిల్‌’లోని పా ట ఇది. అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం నవంబరు 24న రిలీజ్‌ కానుంది. ఈ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ పా ట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ స్వరకల్పనలో ఆర్‌వీ సత్య రాసిన ఈ పా టను సిధ్‌ శ్రీరామ్‌ పా డారు.


 దేఖో ముంబై దోస్తీ మజా... 
కిరణ్‌ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘రూల్స్‌ రంజన్‌’. ఏఎం రత్నం సమర్పణలో దివ్యాంగ్‌ లవానియా, మురళీ కృష్ణ వేమూరి నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 6న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాలోని ‘దేఖో ముంబై దోస్తీ మజా..’ పా ట లిరికల్‌ వీడియోను హీరో రవితేజ రిలీజ్‌ చేశారు. అమ్రిష్‌ గణేష్‌ స్వరకల్పనలో కాసర్ల శ్యామ్, మేఘ్‌ ఉట్‌– వాట్‌ సాహిత్యం అందించగా, అద్నాన్‌ సమీ, పా యల్‌ దేవ్‌ ఈ పా టను పా డారు.

అంజనాద్రిలో...
తేజా సజ్జా, అమృతా అయ్యర్‌ జంటగా నటించిన ‘హను–మాన్‌’ పొస్టర్‌ రిలీజైంది. ‘‘అంజనాద్రి అనే ఊహాత్మక ప్రదేశంలో ఈ సినిమా ఉంటంది. తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, చైనీస్‌ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో జనవరి 12న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో కె. నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top