మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : హీరో గీతానంద్ | 'Game On' Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Game On: మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : హీరో గీతానంద్

Jan 20 2024 5:17 PM | Updated on Jan 20 2024 5:25 PM

Game On Movie Trailer Out - Sakshi

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా న‌టించిన చిత్రం  ‘గేమ్ ఆన్‌’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్  ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న గ్రాండ్ గా విడుద‌ల‌కు సిద్ద‌మ‌వుతోంది.శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు.  

ఈ సందర్భంగా హీరో గీతానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం.  మంచి కాన్సెప్ట్ రాసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం.  ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఒక ఎంప్లాయ్ జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్ లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల గారు ఆదిత్య మీనన్ గారు ఇందులో ఉండడం ఈ సినిమా  నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. గేమ్ స్టార్ట్ చేసాం . మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి.  ఈ సినిమా తర్వాత మా తమ్ముడైన డైరెక్టర్ దయానంద్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు.  నేను కూడా నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను’  అని అన్నారు

‘మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్ చేసాం.   ఎక్కడ  కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం.  ప్రతి విషయంలో క్వాలిటీ ఉండేలా చూసుకున్నాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది’అని నిర్మాత రవి కస్తూరి అన్నారు. ‘కమర్షియల్ స్క్రిప్ట్ ని రా అండ్ రస్టిక్ గా చిత్రీకరించాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. క‌చ్చితంగా మా సినిమా ప్రేక్ష‌కుల‌కు కొత్త ఎక్స్ పీరియ‌న్స్ ఇస్తుంది’ అని దర్శకుడు దయానంద్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్‌ నేహా సోలంకి, నటులు ఆదిత్య మీనన్,కిరిటీ, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్, మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement