గేమ్‌ ఛేంజర్‌లో రామ్‌ చరణ్‌ 'నానా హైరానా' | Game Changer Naa Naa Hyraanaa Song Out Now | Sakshi
Sakshi News home page

గేమ్‌ ఛేంజర్‌లో రామ్‌ చరణ్‌ 'నానా హైరానా'

Nov 28 2024 6:03 PM | Updated on Nov 28 2024 6:57 PM

Game Changer Naa Naa Hyraanaa Song Out Now

రామ్‌ చరణ్‌- శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ సినిమా 'గేమ్‌ ఛేంజర్‌'. తాజాగా ఈ మూవీ నుంచి 'నానా హైరానా' అంటూ సాగే మెలొడీ సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు.  కార్తిక్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించిన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచిస్తే.. సంగీత దర్శకుడు తమన్‌ అదిరిపోయే ట్యూన్స్‌ అందించారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన రెండు మాస్‌ పాటలు ప్రేక్షకులను మెప్పిస్తే.. టీజర్‌కు భారీ రెస్పాన్స్‌ వచ్చింది.

సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానున్న 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఈ మూవీకి తమిళ స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగింది. ఎంజీ రోడ్డులోని పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయ ప్రాంగణంలో పోలింగ్‌ నిర్వహించిన సీన్స్‌ను చిత్రీకరించారు. అక్కడ ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునే సీన్స్‌తో పాటు పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసిన సన్నివేశాలను చిత్రీకరించారు.అయితే ఈ సన్నివేశాల్లో కేవలం జూనియర్‌ ఆర్టిస్ట్‌లు మాత్రమే పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement