అనన్య నాగళ్ల కొత్త మూవీ.. సాంగ్ రిలీజ్‌ చేసిన మంగళవారం బ్యూటీ! | Sakshi
Sakshi News home page

Ananya Nagalla: తంత్రగా వస్తోన్న అనన్య నాగళ్ల.. సాంగ్‌ రిలీజ్!

Published Fri, Jan 12 2024 4:12 PM

First Lyrical Song Released From Ananya Nagalla Movie TANTRA - Sakshi

టాలీవుడ్‌లో 2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల. ఆ తర్వాత  పవన్​ కల్యాణ్​ చిత్రం 'వకీల్​ సాబ్'​తో మరింత ఫేమస్​ అయింది. గతేడాది సమంత లీడ్​ రోల్​ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో మెరిసింది.

తాజాగా అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం 'తంత్ర'. ఇందులో ధనుశ్ రఘుముద్రి హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా..  ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు, రవిచైతన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ధీరే ధీరే అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్. మంగళవారం బ్యూటీ పాయల్ రాజ్‌పుత్‌, అనసూయ చేతుల మీదుగా విడుదల చేశారు. 

 డైరెక్టర్‌ శ్రీనివాస్ గోపిశెట్టి మాట్లాడుతూ.. 'గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌, టీజర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అతి త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ సాంగ్ రిలీజ్ చేసిన పాయల్ రాజ్‌పుత్, అనసూయ ప్రత్యేక కృతజ్ఞతలు' అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. ఫస్ట్-లుక్, టీజర్‌కి వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం' అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో సలోని, టెంపర్ వంశి, మీసాల లక్ష్మణ్, కుషాలిని, మనోజ్ ముత్యం, శరత్ బరిగెల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్ ఆర్ ధృవన్ సంగీతమందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement