Allu Arjun Starrer Pushpa 2 Movie First Glimpse Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: పుష్ప-2 క్రేజీ అప్‌ డేట్.. ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ ఆరోజే..!

Nov 12 2022 7:58 PM | Updated on Nov 12 2022 9:00 PM

First glimpses of Allu Arjun starrer Pushpa 2 Movie to be out on December 17 - Sakshi

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బ్లాక్ బస్టర్ చిత్రం 'పుష్ప'. ఈ చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. బన్నీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప-2 ఫస్ట్ గ్లింప్స్‌ డిసెంబర్‌ 17 రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అప్ డేట్‌తో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.  

పుష్ప-2: ది రూల్  మొదటి ప్రోమో గ్లింప్స్ వీడియోలో అల్లు అర్జున్‌పై తీసిన కొన్ని సీన్స్ హైప్ పెంచేలా ఉండనున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రం కంటే గొప్పగా సీక్వెల్ ఉంటుందని దర్శకుడు సుకుమార్ ఇప్పటికే ప్రకటించారు. పుష్ప విడుదలైన డిసెంబర్ 17 నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న అల్లు అర్జున్ తిరిగొచ్చార షూటింగ్ కోసం బ్యాంకాక్ వెళ్లనున్నారు. తదుపరి షెడ్యూల్ డిసెంబర్ మొదటివారంలో ప్రారంభం కానుంది. బ్యాంకాక్ నుంచి తిరగొచ్చాక బ్లాక్ బస్టర్‌గా నిలిచిన పుష్పను రష్యాలో విడుదల చేయనుండగా ప్రమోషన్లలో అల్లు అర్జున్ పాల్గొననున్నారు.  

 ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీలోనూ ఫాహద్‌ ఫాజిల్, ధనుంజయ, సునీల్, అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement