అఫిషియల్‌: అలియాకు ఫర్హా ఖాన్‌ విషెస్‌, బయటికొచ్చిన వీడియో చాట్‌ | Farah Khan And Friends Wishes Alia Bhatt For Wedding With Ranbir Kapoor | Sakshi
Sakshi News home page

Farah Khan: అలియా-రణ్‌బీర్‌కు ఫర్హా ఖాన్‌ విషెస్‌, వీడియో చాట్‌ వైరల్‌

Apr 12 2022 1:38 PM | Updated on Apr 12 2022 2:00 PM

Farah Khan And Friends Wishes Alia Bhatt For Wedding With Ranbir Kapoor - Sakshi

ప్రస్తుతం బాలీవుడ్‌లో అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌ల పెళ్లి హాట్‌టాపిక్‌గా మారింది. వీరి పెళ్లి ముహుర్తం, వివాహ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పెళ్లిలో కాబోయే జంట ధరించే పెళ్లి పట్టలు, నగలు నుంచి వివాహ వేదిక వరకు అన్నింటిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే పెళ్లి వార్తలపై ఇప్పటి వరకు అలియా కానీ, రణ్‌బీర్‌ కానీ స్పందించలేదు. దీనిపై ఇరు కుటుంబాలు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో అలియా-రణ్‌బీర్‌ పెళ్లి వార్తలను అఫిషియల్‌ చేస్తూ తాజాగా ఓ వీడియో నెట్టింట దర్శనం ఇచ్చింది.

చదవండి: పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్‌! కారణం ఇదేనా?

మహిళ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ వీడియో కాల్‌లో అలియాతో మాట్లాడుతూ కనిపించారు. ఇందులో అలియా వెనకాలే రణ్‌బీర్‌ కూడా కనిపించాడు. ఓ రెస్టారెంట్‌లో విందుకు వెళ్లిన ఫరా ఖాన్‌, ఆమె స్నేహితులు అలియాకు శుభాకాంక్షలు తెలుపుతూ గట్టిగా అరిచారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమైంది. అయితే ఈ లవ్‌బర్డ్స్‌ త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారంటూ వచ్చే వార్తలు నిజమేనంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అలాగే ఈ వీడియో చూసిన ఈ జంట ఫ్యాన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా అలియా-రణ్‌బీర్‌కు నెటిజన్లు సైతం శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 13, 14, 15 తేదీల్లో ఈ జంట ప్రీవెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరగనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అలియా-రణ్‌బీర్‌ల వెడ్డింగ్‌ తేదీ వాయిదా పడిందని ఆమె కజిన్‌ రాహుల్‌ స్పష్టం చేశాడు. రీసెంట్‌గా మీడియాలో మాట్లాడుతూ.. వెడ్డింగ్‌ ప్లాన్స్‌ బయటకు రావడం వల్లే పెళ్లి తేదీని ఏప్రిల్‌ 20కి వాయిదా వేసినట్లు అతడు చెప్పుకొచ్చాడు. 

Advertisement
 
Advertisement
Advertisement