Upasana - Ram charan: రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయే బిడ్డ ఎవరంటే?

Fans Interest On Upasana - Ram charan Expecting Baby Girl - Sakshi

టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో రామ్‌చరణ్‌- ఉపాసన ఒకరు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జూలైలో తమ ఇంటికి పండుగ వాతావరణం ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. గతనెలలో దుబాయ్ వెకేషన్‌ వెళ్లి ఉపాసన- చెర్రీ సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో బేబీ షవర్ వేడుక చేసుకున్నారు. అనంతరం మాల్దీవుల్లో విహరించి హైదరాబాద్‌కు వచ్చేశారు. అయితే హైదరాబాద్‌లోని చిరంజీవి మరోసారి ఘనంగా సీమంతం వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌లో అల్లు అర్జున్, సానియా మీర్జాతో పాటు పలువురు తారలు కూడా పాల్గొన్నారు. 

అయితే తాజాగా మెగా అభిమానుల్లో ఓ చర్చ మొదలైంది. చెర్రీ-ఉపాసనకు పుట్టబోయే బిడ్డ ఎవరన్న దానిపై తెగ చర్చిస్తున్నారు. దీంతో కొందరు అభిమానులు ఈ జంటకు మొదటి పాపే పుడుతుందని అంచనా వేస్తున్నారు. చెర్రీ దంపతులను చూస్తుంటే వారికి అమ్మాయే పుట్టబోతోందని కొందరు చెబుతుండటం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన సీమంతం వేడుకలో ఉపాసన పింక్‌ డ్రెస్‌ ధరించడంతో పాపనే పుడుతుందని చెబుతున్నారు. వీటికి బలం చేకూర్చేలా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. 

నోరు జారిన రామ్ చరణ్

రామ్ చరణ్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ..'నా జీవితంలో అత్యంత ఇష్టమైన వారిలో మొదట నా భార్య ఉపాసన.. ఆ తర్వాత పెట్ డాగ్ రైమ్. ఇప్పుడు మా కుటుంబంలో ఆమె(హర్) వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.' అని అన్నారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ పాపనే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. 

బేబీ షవర్‌లో ఉపాసన పింక్‌ డ్రెస్

చిరంజీవి నివాసంలో జరిగిన ఉపాసన బేబీషవర్‌లో పింక్‌ డ్రెస్‌లో మెరిసింది. ఈ కలర్‌ డ్రెస్ ధరించడంతో ఆమెకు ఆడపిల్ల పుట్టబోతోందన్న వార్తలకు మరింత బలం చేకూర్చారు. ఏప్రిల్ 23, 2023న కుటుంబ సభ్యులు, ఈ జంట సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉపాసన మెరిసే గులాబీ రంగు దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. పింక్ రంగు అమ్మాయిల సింబాలిక్‌ను సూచిస్తుంది కాబట్టి ఉపాసన గులాబీ రంగు దుస్తులు ధరించిందని పేర్కొన్నారు. టాలీవుడ్ జంట త్వరలోనే తమ జీవితంలో పాపను స్వాగతించేందుకు రెడీగా ఉన్నారని అంచనా వేస్తున్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top