
సినిమా ఇండస్ట్రీలో ఉన్నన్నాళ్లూ బాగా సంపాదించి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకుంటారు. అయితే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ (Fahadh Faasil).. సినిమాలు మానేశాక కూడా పని చేయాలనుకుంటున్నాడు. అవును, యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పిననాడు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తానని గతంలో కూడా అన్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
బోర్ కొట్టాక అదే చేస్తా
ఫహద్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు నన్ను చూసి బోర్ కొట్టినప్పుడు సినిమాలు మానేసి స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్‌గా ఉద్యోగం చేస్తాను. జనాలను వారి గమ్యస్థానాలకు చేర్చడం కంటే సంతృప్తికరమైనది మరోటి లేదు. ఛాన్స్ వచ్చినప్పుడు కచ్చితంగా డ్రైవర్‌గా మారిపోతాను. అప్పుడు నేను డ్రైవింగ్ చేయడంతోపాటు చుట్టూ ఉన్న పరిసరాలను మరింత నిశితంగా పరిశీలించే అవకాశం దొరుకుతుంది. వ్యక్తిత్వ వికాసానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది అని పేర్కొన్నాడు.
రిటైర్ అయ్యాక అక్కడే..
కాగా ఫహద్.. భార్య నజ్రియాతో కూడా ఎప్పుడూ ఇదే మాట చెప్తుంటాడు. రిటైర్‌మెంట్ తర్వాత బార్సిలోనాలో సెటిలైపోయి డ్రైవర్‌గా పని చేస్తానని పలుమార్లు చెప్పాడు. అందుకు నజ్రియా కూడా సంతోషంగా ఒప్పుకుందట! ఫహద్ ఫాజిల్.. ఆర్టిస్ట్, బెంగళూరు డేస్, కుంబలంగి నైట్స్, ట్రాన్స్, ఆవేశం వంటి పలు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్‌గా అనేక సినిమాలు చేశాడు. తెలుగులో పుష్ప 1, పుష్ప 2 సినిమాల్లో విలన్‌గా మెప్పించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో నాలుగైదు చిత్రాలున్నాయి.
చదవండి: 'మడిసన్నాక కూసంత కలాపోసనుండాల'.. నేటికీ ఈ డైలాగ్స్..