ఆహాలో ఫహద్‌ ఫాజిల్‌ కొత్త మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే? | Sakshi
Sakshi News home page

Fahadh Faasil: ఆహాలో రానున్న మాలిక్‌ మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

Published Thu, Jul 28 2022 9:11 PM

Fahadh Faasil Malik Movie To Streaming On AHA - Sakshi

ఫహద్‌ ఫాజిల్‌.. మలయాళ సినిమాలు ఇష్టపడే వారికి ఈ పేరు బాగా సుపరిచితమే. మరీ ముఖ్యంగా పుష్ప సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యాడీ హీరో. ఆయన ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ మాలిక్‌. కరోనా కారణంగా గతేడాది ఓటీటీలో రిలీజై విశేషాదరణ పొందింది మాలిక్‌. ఇప్పుడు ఇక్కడి ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా మాలిక్‌ను తెలుగులో అందుబాటులోకి తీసుకువస్తోంది.ఇప్పటికే సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయగా తాజాగా స్ట్రీమింగ్‌ డేట్‌ను ప్రకటించారు.

ఆగస్టు 12 నుంచి ఆహాలో అందుబాటులోకి రానున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో నిమిష సజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌, జలజ, జోజు జార్జ్‌, దిలీష్‌ పోతన్‌, ఇంద్రన్స్‌, సలీమ్‌ కుమార్‌ ముఖ్యపాత్రలు పోషించారు. సజు వర్గీస్‌ సినిమాటోగ్రఫీ అందించాడు. మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహించాడు.

చదవండి: చైతూతో కలిసి ఉన్న ఇంటినే ఎక్కువ రేటుకు కొనుక్కున్న సామ్‌
భారీ బడ్జెట్‌, అత్యంత ఘోరమైన ఫ్లాప్‌.. ఆవేదన వ్యక్తం చేసిన నటుడు

Advertisement
 
Advertisement
 
Advertisement