కొనసాగుతున్న కరోనా కలకలం.. మరో హీరోయిన్‌కు పాజిటివ్‌ | Esha Gupta Tested Positive For Covid 19 | Sakshi
Sakshi News home page

Esha Gupta: బీటౌన్‌ బ్యూటీకి కొవిడ్‌.. మరింత స్ట్రాంగ్‌గా తిరిగి వస్తానని

Jan 9 2022 5:34 PM | Updated on Jan 9 2022 5:34 PM

Esha Gupta Tested Positive For Covid 19 - Sakshi

Esha Gupta Tested Positive For Covid 19: బాలీవుడ్‌లో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. తాజాగా బీటౌన్‌ బ్యూటీ ఇషా గుప్తా కొవిడ్‌ బారిన పడింది. కరోనా పరీక్షలు నిర్వహించుకోగా ఆమెకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఇషా తన ఇన్‌స్టా గ్రామ్‌ అకౌంట్‌ ద్వారా తెలియజేసింది. 'అత్యంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా సోకింది. నేను ఐసోలేట్‌ అయి నిబంధనలు పాటిస్తున్నాను. ప్రస్తుతం హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. దీని నుంచి మరింత స్ట్రాంగ్‌గా మెరుగ్గా తిరిగి వస్తాను. దయచేసి అందరూ సురక్షితంగా ఉండండి. మాస్క్‌ ధరించండి. మిమ్మల్ని, ఇతరులను జాగ్రత్తగా చూసుకోండి.' అని ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది 'జన్నత్‌ 2' బ్యూటీ. 

దేశవ్యాప్తంగా కరోనా థర్డ్‌ వేవ్‌ విజృంభించడంతో బీటౌన్‌ ప్రముఖులు కొవిడ్‌కు గురవుతున్నారు. దీంతో ఐసోలేట్‌ అయి ఒంటరిగా గడుపుతున్నారు. ఇప్పటికే ప్రేమ్‌ చోప్రా, బోనీ కపూర్‌, ఏక్తా కపూర్‌, జాన్‌ అబ్రహం, అతని భార్య ప్రియా రుంచల్‌, విశాల్‌ డడ్లానీ, స్వరా భాస్కర్‌, మృణాల్‌ ఠాకూర్‌, అర్జున్‌ కపూర్, అలయ ఎఫ్‌లకు కరోనా సోకింది. హాట్‌ బ్యూటీ నోరా ఫతేహీకి కరోనా పాజిటివ్‌ రాగా ఇటీవలే నెగెటివ్‌ వచ్చినట్లు ప్రకటించింది. 



ఇదీ చదవండి: బుల్లితెర హీరోయిన్‌కు కొవిడ్‌.. అవి నమ్మొద్దని సలహా

Advertisement
 
Advertisement
Advertisement