Liger Movie: లైగర్‌ పెట్టుబడులు.. పూరీ, చార్మీలపై ఈడీ ప్రశ్నల వర్షం

Enforcement Directorate Questions To Liger Producers Puri Jagannadh, Charmme Kaur - Sakshi

రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ నటించిన లైగర్‌ సినిమా లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఫోకస్‌ చేసింది. ఈ సినిమాలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టారన్న విషయంపై లైగర్‌ నిర్మాతలు పూరీ జగన్నాథ్‌, చార్మీలను విచారిస్తోంది. గురువారం పూరీ, చార్మీ ఈడీ ఆఫీస్‌కు రాగా.. సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. కాగా వీరు ఫెమా(విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు అధికారులు ఇప్పటికే పలు ఆధారాలు సేకరించారు.

ఇకపోతే లైగర్‌ సినిమాలో రాజకీయ నేతలు బ్లాక్‌మనీని పెట్టుబడులుగా పెట్టారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై ఈడీకి ఫిర్యాదు కూడా అందింది. దీనికి తోడు లైగర్‌ నిర్మాతలు ఫెమా నిబంధనలను బ్రేక్‌ చేసినట్లు ఆధారాలు దొరకడంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పూరీ, చార్మీలకు పదిహేను రోజుల క్రితమే నోటీసులు పంపినట్లు సమాచారం. ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డ పూరీ, చార్మీతో కలిసి నేడు ఈడీ ఆఫీస్‌కు వెళ్లగా.. విదేశీ పెట్టుబడుల గురించి ఈడీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: అమెజాన్‌ ప్రైమ్‌లోకి కాంతార, కాకపోతే ఓ ట్విస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top