‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ట్రైలర్‌ బాగుంది : పూరి‌ | Ee Kathalo Patralu Kalpitam Movie Triled Launched By Puri Jagannadh | Sakshi
Sakshi News home page

‘ఈ కథలో పాత్రలు కల్పితం’ ట్రైలర్‌ బాగుంది : పూరి

Mar 13 2021 4:10 PM | Updated on Mar 13 2021 4:10 PM

Ee Kathalo Patralu Kalpitam Movie Triled Launched By Puri Jagannadh - Sakshi

పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన జంటగా నటిస్తున్న చిత్రం 'ఈ కథలో పాత్రలు కల్పితం'. అభిరామ్‌ ఎమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రాజేష్‌ నాయుడు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుద‌లైన ఈ మూవీ పోస్టర్స్‌‌కి, సాంగ్స్‌కి, టీజర్‌కి మంచి స్పందన వస్తోంది.

ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ దక్కగా, సెకండ్ లిరికల్ సాంగ్‌ను వైఎస్ షర్మిల రిలీజ్ చేశారు. ఆ పాటకి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రిలీజ్ చేశారు.. ముంబై లో ఉన్న పూరీజగన్నాధ్ ఇంటికి వెళ్లి చిత్ర యూనిట్ ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు.

కాగా ఈ కార్యక్రమంలో  అంబర్ పేట్ శంకరన్న, నిర్మాత చార్మీ, పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూరీ జగన్నాధ్ మాట్లాడుతూ.. 'ఈ కథలో పాత్రలు కల్పితం' .. టైటిల్ చాలా వెరైటీ గా ఉంది. ట్రైలర్ కూడా బాగుంది. విజువల్స్ అదిరిపోయాయి..సినిమా కూడా చాలా బాగుంటుంది. వెరైటీ స్టోరీ తో రాబోతున్న సినిమా అని ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తుంది. అభిరామ్ ఎమ్‌. దర్శకత్వం చాలా బాగుంది. నిర్మాత రాజేష్‌ నాయుడుకి ఈ సినిమా ద్వారా మంచి లాభాలొచ్చి ఇలాంటి సినిమాలు ఇంకా ఇంకా నిర్మించాలని కోరుకుంటున్నాను. పవన్‌ తేజ్‌ కొణిదెల, మేఘన చాల బాగా కనిపిస్తున్నారు. సినిమా ని అందరు చూడండి..  ఈ సినిమా కోసం కష్టపడ్డ టీం అందరికి అల్ ది బెస్ట్.. అన్నారు.

చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. 'ఈ కథలో పాత్రలు కల్పితం'  సినిమా బాగా ఆడాలని కోరుకునే అందరికి నా కృతజ్ఞతలు.. మా ఆహ్వానాన్ని మన్నించి చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్న డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా కి మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వైఎస్ షర్మిల గారికి, నాగబాబు కొణిదెల గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కి మీరు ఇచ్చిన సహాయ సహకారాలు మర్చిపోలేనివి. అలాగే ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సపోర్ట్ చేసిన అందరికి చిత్ర యూనిట్ తరపున హృద‌య‌పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అని అన్నారు. ఈ సినిమాకి కార్తిక్‌ కొడకండ్ల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement