నాలుగేళ్ల క్రితం వెండితెరపై తెరకెక్కిన అందమైన ప్రేమ కావ్యం సీతారామం. దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్‌గా.. మృణాల్ ఠాకూర్ సీతామహాలక్ష్మిగా ఒదిగిపోయారు. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ మూవీ 2022లో విడుదలై క్లాసిక్ హిట్ అందుకుంది. అయితే ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ మళ్లీ రాబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
కాంబినేషన్ రిపీట్?
ఈ మేరకు ఓ ఫోటో వైరల్ అవుతోంది. అందులో దుల్కర్ సల్మాన్, మృణాల్.. వర్షంలో ఒకే గొడుగు కింద నిల్చుని ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఇది చూసిన అభిమానులు సీతారామం మూవీకి సీక్వెల్ రాబోతోందా? అని చర్చ మొదలుపెట్టారు.. మొదటి పార్ట్‌లో రామ్ మరణించడంతో కథ ముగుస్తుంది. మరి పార్ట్ 2లో రామ్ బతికే ఉంటాడా? ఎలా చూపిస్తారు? అన్న ఆసక్తి అందరిలో మొదలైంది.
సీక్వెల్?
గతంలో సీతారామం సీక్వెల్ గురించి దుల్కర్ మాట్లాడుతూ.. క్లాసిక్‌గా నిలిచిన సినిమాలను మళ్లీ టచ్ చేయకూడదనే విషయాన్ని నేను నటుడిని కాకముందే తెలుసుకున్నా.. సీతారామం సినిమాను ప్రేక్షకులు హృదయాల్లో దాచుకున్నారు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉండదనుకుంటున్నాను అన్నాడు. మరి ఈ పోస్టర్ దుల్కర్-మృణాల్‌ల కొత్త సినిమానా? లేదా సీతారామం సీక్వెలా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే వెండితెరపై మ్యాజిక్ జరగడం ఖాయం అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
#DulquerSalmaan and #MrunalThakur are teaming up once again! 👀
- So it a new film / A #SitaRamam sequel ? pic.twitter.com/0DsewqVsGg— Movie Verse (@_MovieVerse) January 27, 2026
చదవండి: మేలో దేవర 2 స్టార్ట్


