OTT: 13 వారాలుగా ట్రెండింగ్‌లో తెలుగు సినిమా | Dulquer Salmaan Lucky Bhaskar Movie Trending On OTT From 13 Weeks, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Lucky Bhaskar In OTT: నెట్‌ఫ్లిక్స్‌లో 13 వారాలుగా ట్రెండింగ్‌.. తొలి సౌత్‌ సినిమాగా రికార్డు!

Published Wed, Feb 26 2025 8:29 PM | Last Updated on Thu, Feb 27 2025 1:00 PM

Dulquer Salmaan Lucky Bhaskar Movie Trending on OTT from 13 Weeks

పండగను క్యాష్‌ చేసుకోవాలని ఎవరు మాత్రం అనుకోరు. అందుకే పోటీ ఉన్నా సరే పండక్కి వచ్చేందుకు సిద్ధవుతుంటారు. అలా గతేడాది దీపావళికి కిరణ్‌ అబ్బవరం 'క', శివకార్తికేయన్‌ 'అమరన్‌', దుల్కర్‌ సల్మాన్‌ 'లక్కీ భాస్కర్‌' (Lucky Baskhar Movie) చిత్రాలు రిలీజయ్యాయి. అక్టోబర్‌ 31న విడుదలైన ఈ మూడు సినిమాలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో ఇవన్నీ బాక్సాఫీస్‌ వద్ద గండం గట్టెక్కడమే కాకుండా హిట్‌, సూపర్‌ హిట్‌ జాబితాలో చేరిపోయాయి. 

ఓటీటీలో టాప్‌ ప్లేస్‌లో..
ఈ మూడు చిత్రాలు ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చేశాయి. లక్కీ భాస్కర్‌ చిత్రం నవంబర్‌ 28న నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో రిలీజైంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రసారమవుతోంది. అయితే మూడు నెలలుగా ఈ సినిమా ఓటీటీలో టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్‌ అవుతోంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్‌ అధికారికంగా వెల్లడించింది. 13 వారాలుగా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న తొలి దక్షిణాది సినిమా అంటూ సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేసింది.

చదవండి: కలర్‌ ఫోటో చేతులారా వదిలేసుకున్నా..: హీరోయిన్‌

సినిమా
లక్కీ భాస్కర్‌ సినిమా విషయానికి వస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించారు. జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించగా.. నిమిషా రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.

 

 

చదవండి: Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement