Dulquer Salmaan At 'King Of Kotha' Pre-Release Event - Sakshi
Sakshi News home page

నా స్క్రీన్‌ టైమ్‌ తక్కువే కానీ..

Aug 18 2023 3:47 AM | Updated on Aug 18 2023 10:15 AM

Dulquer Salmaan in King of Kota Pre Release - Sakshi

‘‘దర్శకుడు అభిలాష్‌ జోషి ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ సినిమా స్కేల్‌ గురించి చెప్పినప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ప్రొడక్షన్‌ పరంగా చాలా పెద్ద సినిమా. ప్రతి షాట్‌ చాలా నిండుగా అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. మలయాళంలో ఇంత పెద్ద స్కేల్‌ సినిమాలో భాగం కావడం నాకు ఇదే తొలిసారి’’ అని హీరోయిన్‌ ఐశ్వర్యా లక్ష్మి అన్నారు. దుల్కర్‌ సల్మాన్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా అభిలాష్‌ జోషి దర్శకత్వం వహించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. జీ స్టూడియోస్, వేఫేరర్‌ ఫిల్మ్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మి మాట్లాడుతూ– ‘‘కింగ్‌ ఆఫ్‌ కోత’లో తార పాత్ర చేశాను. దుల్కర్‌ పేరు రాజు. తార, రాజు మధ్య అందమైన లవ్‌ స్టోరీ ఉంటుంది. నా పాత్రకి స్క్రీన్‌ టైమ్‌ తక్కువగానే ఉన్నప్పటికీ కథలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చేసినప్పుడు సవాల్‌గా అనిపించింది. నాకంటూ డ్రీమ్‌ రోల్స్‌ ప్రత్యేకంగా లేవు. కానీ, నేను చేసిన పాత్రలు గుర్తుండిపోవాలని కోరుకుంటాను. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement