‘ఐ యామ్ గేమ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నహాస్ హిదాయత్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది.
ఈ చిత్రంలో కయాదు లోహర్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్, తమిళ నటుడు – దర్శకుడు మిస్కిన్, కదిర్, పార్థ్ తివారీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘‘ఈ ఏడాది ఓనమ్ పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని ఆగస్టులో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషలలో రిలీజ్ చేస్తాం’’ అని యూనిట్ పేర్కొంది.


