మంచులో ప్రేమ | Dulquer Salmaan and Pooja Hegde wrap Himalayan schedule | Sakshi
Sakshi News home page

మంచులో ప్రేమ

May 25 2026 12:06 AM | Updated on May 25 2026 12:06 AM

Dulquer Salmaan and Pooja Hegde wrap Himalayan schedule

హాట్‌ హాట్‌ సమ్మర్‌లో కూల్‌ కూల్‌ ప్రదేశాలకు వెళితే ఆ హాయే వేరు. దుల్కర్‌ సల్మాన్, పూజా హెగ్డేకి ఆ చాన్స్‌ దక్కింది. ఈ ఇద్దరూ జంటగా రూపొందుతున్న తాజా చిత్రం షూటింగ్‌ ఓ చల్లని ప్రదేశంలో జరిగింది. మంచు, చిరు జల్లుల మధ్య ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసింది యూనిట్‌. ఆ ఫొటోలను విడుదల చేశారు. 

చిరు జల్లుల నుంచి తప్పించుకోవడానికి గొడుగు, చలి తట్టుకోవడానికి వింటర్‌ అవుట్‌ఫిట్స్‌లో ప్రకృతిని ఆస్వాదిస్తూ కనిపించారు దుల్కర్, పూజ. అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని రవి నెలకుడితి దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరించారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: అనయ్‌ ఓం గోస్వామి.

Advertisement
 
Advertisement
Advertisement