థాయ్‌లాండ్‌లో డబుల్‌  | Double Smart started the second schedule in Thailand | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్‌లో డబుల్‌ 

Aug 14 2023 12:32 AM | Updated on Aug 14 2023 12:32 AM

Double Smart started the second schedule in Thailand - Sakshi

షూటింగ్‌లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ యూనిట్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (2019) వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత హీరో రామ్‌ పొతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. పూరి కనెక్ట్స్‌పై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో షెడ్యూల్‌ థాయిలాండ్‌లోప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు మేకర్స్‌.  ‘‘హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. రెండో షెడ్యూల్‌ థాయిలాండ్‌లోప్రారంభించాం.

ఈ షెడ్యూల్‌లో రామ్, నటుడు సంజయ్‌ దత్‌పై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 2024 మార్చి 8న మహా శివరాత్రికి విడుదలవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సీఈఓ: విషు రెడ్డి, కెమెరా: జియాని గియాన్నెల్లి.

Advertisement
 
Advertisement
Advertisement