Sai Dharam Tej Health Condition: Doctors Treatment To Sai Dharam Tej On Ventilator - Sakshi
Sakshi News home page

వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్‌.. కొనసాగుతున్న చికిత్స

Sep 11 2021 9:02 AM | Updated on Sep 11 2021 10:48 AM

Doctors Treatment To Sai Dharam Tej On Ventilator - Sakshi

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

Sai Dharam Tej Health Condition: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్‌తేజ్‌కు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. నలుగురు వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఇంకా వెంటిలేటర్‌పైనే సాయిధరమ్‌తేజ్‌కు చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు శనివారం ఉదయం తాజా హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇవాళ కూడా ఐసీయూలోనే సాయిధరమ్‌తేజ్‌కు చికిత్స అందిస్తామని వెల్లడించారు. రేపు మరోసారి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.

ప్రయాణానికి ముందు సాయిధరమ్‌ తేజ్‌ ఆహారం తినడంతో.. ప్రమాద వల్ల పుడ్‌పైప్‌ నుంచి ఊపిరితిత్తుల పైప్‌ వరకు ఆహారం చేరింది. ఊపిరితిత్తుల వద్ద ఇరుక్కున్న ఆహారాన్ని వైద్యులు రాత్రి తొలగించారు. ప్రమాదం వల్ల ఒత్తిడికి గురైన సాయిధరమ్‌తేజ్‌ కుడివైపు ఊపిరితిత్తులు జీసీఎస్‌ స్కోర్‌ తక్కువగా ఉన్నట్లు వైద్యులు గమనించారు. శరీర భాగాల్లో ఎక్కడైనా అవయవాలు దెబ్బతిన్నాయా అనేదానిపై వైద్యులు పరిశీలిస్తున్నారు.

ఇవీ చదవండి:
సాయిధరమ్‌తేజ్‌ కోలుకుంటున్నారు: చిరంజీవి

షటప్‌.. ఉమాదేవికి ఇచ్చిపడేసిన ప్రియాంక సింగ్‌

Advertisement
 
Advertisement
Advertisement