DJ Tillu Theatrical Trailer Released: 'నా పాట విని బన్నీ బట్టలు చింపుకుండు' - Sakshi
Sakshi News home page

DJ Tillu Trailer: డిజె టిల్లు ట్రైలర్‌ చూశారా?

Feb 3 2022 8:19 AM | Updated on Feb 3 2022 9:54 AM

DJ Tillu Theatrical Trailer Released - Sakshi

‘‘ఈ ఏడాది మా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి మూడు చిన్న సినిమాలు, ఓ పెద్ద సినిమా (భీమ్లా నాయక్‌) విడుదల చేస్తాం. ‘డిజె టిల్లు’ యూత్‌ సినిమా. నాకు బాగా నచ్చిన కథ ఇది. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అని సూర్యదేవర నాగవంశీ అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డిజె టిల్లు’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకానుంది.

ఈ సందర్భంగా బుధవారం థియేట్రికల్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో హీరో మాట్లాడుతూ.. బన్నీ సినిమాతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా లాంచ్‌ అవబోతున్నా.. ఓ కామన్‌ ఫ్రెండ్‌ బర్త్‌డే పార్టీలో కలిసిండు. డీజే టిల్లు సాంగ్‌ విని బట్టలు చింపేసుకుండు, అరేయ్‌ టిల్లు ఇసొంటి పాటనే కావాలన్నడు అంటూ హీరోయిన్‌ను పడగొట్టేందుకు లేనిపోని గొప్పలు చెప్పుకున్నాడు. మొత్తానికి ఈ ట్రైలర్‌ వినోదాత్మకంగా ఉంది.

ఈ చిత్రం ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘విమల్‌కృష్ణ, నేను ‘డిజె టిల్లు’ కథ, స్క్రీన్‌ప్లే రాశాం. డైలాగ్స్‌ నేనే రాశా. త్రివిక్రమ్‌గారు స్క్రిప్ట్‌ విషయంలో సలహాలిచ్చారు. రచయితగా నా మీద జంధ్యాల, త్రివిక్రమ్‌గార్ల ప్రభావం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు విమల్‌కృష్ణ. నేహా శెట్టి, నటుడు ప్రిన్స్‌ మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ధీరజ్‌ మొగిలినేని, సమర్పణ: పీడీవీ ప్రసాద్‌. 

Advertisement
 
Advertisement
Advertisement