
యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కానుండటంతో ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుశసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్30 ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది.
గతంలో ఈ సినిమాలో ఆలియా భట్ నటించనుందనే రూమర్స్ వినిపించినా పెళ్లి తర్వాత ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్నదానిపై రకరకాల పేర్లు వినిపించాయి. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ ఫైనలైజ్ అయ్యిందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.