ధనుష్‌, రజనీకాంత్‌లతో భారీ ప్రాజెక్ట్స్‌ ప్లాన్‌ చేస్తున్న దర్శకుడు | Director Vinodh Movie Plan With Danush or Rajanikanth | Sakshi
Sakshi News home page

ధనుష్‌, రజనీకాంత్‌లతో భారీ ప్రాజెక్ట్స్‌ ప్లాన్‌ చేస్తున్న దర్శకుడు

Jun 20 2025 12:55 PM | Updated on Jun 20 2025 1:08 PM

Director Vinodh Movie Plan With Danush or Rajanikanth

కోలీవుడ్‌ టాప్‌ హీరో విజయ్‌  నటిస్తున్న తాజా చిత్రం జననాయకన్‌. నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి హెచ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే చిత్రం షూటింగ్‌ పూర్తి కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జననాయకన్‌ చిత్రం కథ గురించి పలు రకాల ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది. ముఖ్యంగా ఇది సమకాలీన రాజకీయాలను తెరపై ఆవిష్కరించే పవర్‌ ప్యాక్డ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథా చిత్రంగా ఉంటుందనేది గట్టిగా జరుగుతున్న ప్రచారం. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం కథను దర్శకుడు హెచ్‌ వినోద్‌ నటుడు కమలహాసన్‌ కోసం తయారు చేసిందనే ప్రచారం జరిగింది. 

మొత్తం మీద నటుడు విజయ్‌ రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ముందు అంటే 2026 జనవరి 8వ తేదీన తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. దీంతో దర్శకుడు హెచ్‌ వినోద్‌ నెక్ట్స్‌ చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. తదుపరి ధనుష్‌ హీరోగా చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కాగా తాజాగా రజనీకాంత్‌ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల దర్శకుడు హెచ్‌ వినోద్‌ నటుడు రజనీకాంత్‌ను కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. కథ చెప్పడానికే హెచ్‌ వినోద్‌ నటుడు రజనీకాంత్‌ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. 

కాగా లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కూలీ చిత్రాన్ని పూర్తి చేసిన రజనీకాంత్‌ ప్రస్తుతం నెల్సన్‌ దర్శకత్వంలో జైలర్‌ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఈయన హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో నటిస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. రజనీతో ఛాన్స్‌ లేదంటే ధనుష్‌తో ప్లాన్‌ చేస్తారా అనే టాక్‌ కూడా ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

Advertisement
 
Advertisement
Advertisement