Trivikram Srinivas : ఖరీదైన కారును కొన్న త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌.. ధర తెలిస్తే షాక్‌!

Director Trivikram Srinivas Bought New Luxury Car Photo Viral - Sakshi

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారాయన. ప్రస్తుతం మహేశ్‌బాబుతో SSMB28 ఓ సినిమాను చేస్తున్నారు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

రీసెంట్‌గా త్రివిక్రమ్‌ ఖరీదైన  బీఎండబ్ల్యూ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ లగ్జరీ కారు ధర 1.34 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది వరకే ఆయన గ్యారేజీలో ఖరీదైన కార్లు ఉన్నా తాజాగా మరో కొత్త కారును కొనుగోలు చేశారు. ప్రస్తుతం మహేష్‌తో సినిమా పూర్తైన తర్వాత ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top