ఆలోచింపజేసే కాప్‌  | director somusundaram movie cop trailer launch | Sakshi
Sakshi News home page

ఆలోచింపజేసే కాప్‌ 

Apr 15 2024 5:52 AM | Updated on Apr 15 2024 5:52 AM

director somusundaram movie cop trailer launch - Sakshi

ప్రముఖ నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ రవిశంకర్‌ ప్రధాన పాత్రలో, నిఖిల్, రాజశేఖర్, తేజ హీరోలుగా రూపొందిన చిత్రం ‘కాప్‌’. రాధా సురేష్‌ సమర్పణలో మాధవన్‌ సురేష్‌ నిర్మించారు. బి. సోము సుందరం దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ని తిరుపతి ఎస్వీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో విడుదల చేశారు. ఎస్వీ కాలేజ్‌ డైరెక్టర్‌ డా.యన్‌. సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ– ‘‘మా కళాశాల విద్యార్థి మాధవన్‌ సురేష్‌ యూఎస్‌ వెళ్లి అంచలంచెలుగా ఎదిగి సినిమా నిర్మించే స్థాయికి రావడం హ్యీపీ.

నితిన్‌ కూడా మా కాలేజ్‌ కుర్రాడే’’ అన్నారు. ‘‘శత్రుపురం, మన్యం రాజు’ చిత్రాల తర్వాత నేను డైరెక్ట్‌ చేసిన మూడో చిత్రం ఇది’’ అన్నారు సోము సుందరం. ‘‘మా సినిమాని హిట్‌ చేయాలి’’ అన్నారు రాధా సురేష్‌. ‘‘పోలిటికల్‌ సెటైర్‌తో పాటు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో మంచి సందేశం ఉంది’’ అన్నారు మాధవన్‌ సురేష్‌.

Advertisement
 
Advertisement
Advertisement