ప్రతిభ ఉంటే సరిపోదు, టైం కూడా కలిసిరావాలి

Director Rakesh Uppalapati Talks About Nenu Student Sir - Sakshi

– రాకేష్‌ ఉప్పలపాటి

‘‘ఇండస్ట్రీలో దర్శకుడిగా అవకాశం రావాలంటే ప్రతిభతో పాటు సరైన టైమ్‌ కూడా కలిసిరావాలని నమ్ముతాను. ఎందుకంటే ఫిల్మ్‌నగర్, కృష్ణానగర్‌లో దర్శకులు కావాలనుకునే కొందరితో నేను మాట్లాడుతున్నప్పుడు వారిలో నా కన్నా ఎక్కువ ప్రతిభ ఉన్నట్లు అనిపిస్తుంటుంది’’ అని డైరెక్టర్‌ రాకేష్‌ ఉప్పలపాటి అన్నారు. బెల్లంకొండ గణేష్, అవంతిక దాసాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌!’.

రాకేష్‌ ఉప్పలపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్  2న విడుదల కానుంది. ఈ సందర్భంగా రాకేష్‌ ఉప్పలపాటి మాట్లాడుతూ– ‘‘నా స్వస్థలం భీమడోలు. నాన్నగారి వ్యాపారం నిమిత్తం తాటిపాకకు మారాం. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమాకు దర్శకత్వ విభాగంలో పనిచేశాను.

ఆ తర్వాత తేజగారి దగ్గర అసిస్టెంట్‌గా వర్క్‌ చేశాను. కృష్ణ చైతన్యగారి కథతో ‘నేను స్టూడెంట్‌ సర్‌’ సినిమా చేశాను. హీరోకి ఇష్టమైన ఫోన్, అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్‌.. ఈ మూడు అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. హీరోకి, ఓ పోలీస్‌ కమిషనర్‌కు మధ్య ఎలాంటి యుద్ధం నెలకొంది? అనేది ఇందులో ఆసక్తిగా ఉంటుంది. నిర్మాత ‘నాంది’ సతీష్‌గారితోనే మరో సినిమా చేస్తాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top