సీక్వెల్‌ ప్లాన్  ఉంది | Sakshi
Sakshi News home page

సీక్వెల్‌ ప్లాన్  ఉంది

Published Sun, Feb 25 2024 1:42 AM

Director Keerthi Kumar Interview about Chaari 111 - Sakshi

‘వెన్నెల’ కిశోర్‌ హీరోగా నటించిన చిత్రం ‘చారి 111’. సంయుక్తా విశ్వనాథన్  హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మురళీ శర్మ కీలక పాత్ర చేశారు. ‘మళ్లీ మొదలైంది’ ఫేమ్‌ టీజీ కీర్తీకుమార్‌ దర్శకత్వంలో అదితి సోనీ నిర్మించిన ఈ చిత్రం మార్చి 1న థియేటర్స్‌లో విడుదల కానుంది.

ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో కీర్తీ కుమార్‌ మాట్లాడుతూ–  ‘‘సుమంత్‌గారితో తీసిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా సమయంలో ‘వెన్నెల’ కిశోర్‌గారికి  ‘చారి 111’ స్టోరీలైన్  చెప్పాను. ఓకే చెప్పారు. ఆయన్ను దష్టిలో పెట్టుకునే ఈ సినిమా కథ రాశాను. స్పై కామెడీ ఫిల్మ్‌ ‘జానీ ఇంగ్లిష్‌’ తరహాలో ‘చారి 111’ చిత్రం ఉంటుంది. ఈ  చిత్రానికి సీక్వెల్‌ ఆలోచన ఉంది’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement