
'విరూపాక్ష' సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కార్తీక్ వర్మ దండు.. పెద్దగా హడావుడి లేకుండానే నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆదివారం అమ్మాయి ఇంటి దగ్గర ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలోనే తోటి దర్శకులు కార్తీక్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తన ఎంగేజ్మెంట్ వీడియోని కార్తీక్ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరు? పెళ్లి ఎప్పుడు?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్)
దర్శకుడు సుకుమార్ శిష్యుల్లో ఒకడు కార్తీక్ వర్మ దండు. 'కార్తికేయ' సినిమాకు రైటర్‌గా పనిచేసిన అనుభవం ఉంది. అలా 2015లో 'భమ్ భోలేనాథ్' మూవీతో డైరెక్టర్‌గా పరిచమయ్యాడు. కానీ ఆ చిత్రం అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో మరో ప్రయత్నం చేయలేదు. చాన్నాళ్ల గ్యాప్ తీసుకుని మెగా హీరో సాయిధరమ్ తేజ్‌తో 'విరూపాక్ష' తీశాడు. ఇది సూపర్ హిట్ అయింది.
'విరూపాక్ష' హిట్ కావడంతో నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం ఆ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా మొదలు పెట్టేసినట్లు తెలుస్తోంది. ఓవైపు దర్శకుడిగా తన కెరీర్ బిల్డ్ చేసుకుంటూనే మరోవైపు ఫ్యామిలీ పర్సన్ అయ్యేందుకు కార్తీక్ వర్మ సిద్ధమైపోయాడు. ఈ క్రమంలోనే హర్షిత అనే అమ్మాయితో ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈమెది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు. బంధువుల అమ్మాయిలా అనిపిస్తుంది. పెళ్లి కూడా ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్)


