‘ప్రేమలు’ తెలుగులోనూ అంతే హిట్‌: దిల్‌ రాజు | Dil Raju Talk About Premalu Movie At Success Meet | Sakshi
Sakshi News home page

Premalu: ‘ప్రేమలు’ తెలుగులోనూ అంతే హిట్‌: దిల్‌ రాజు

Mar 9 2024 11:20 AM | Updated on Mar 9 2024 11:41 AM

Dil Raju Talk About Premalu Movie At Success Meet - Sakshi

‘‘ప్రేమలు’ సినిమా మలయాళంలో ఫిబ్రవరి 9న విడుదలై సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఇది మలయాళ సినిమా అయినప్పటికీ 90 శాతం చిత్రీకరణ హైదరాబాద్‌లోనే జరిగింది. శుక్రవారం తెలుగులో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ స్పందన చూస్తుంటే మలయాళంలో ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో తెలుగులోనూ అంతే హిట్‌ అవుతుందనిపిస్తోంది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు.

నస్లేన్‌ కె. గఫూర్, మాథ్యూ థామస్, మమిత బైజు, శ్యామ్‌ మోహన్‌ కీలక పాత్రల్లో గిరీష్‌ ఏడీ దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమలు’. ఫాహద్‌ ఫాజిల్, దిలీష్‌ పోతన్, శ్యామ్‌ పుష్కరన్‌  నిర్మించిన ఈ మూవీ మలయాళంలో హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తనయుడు ఎస్‌ఎస్‌ కార్తికేయ తెలుగు ప్రేక్షకులకు అందించారు. శుక్రవారం ఈ మూవీ రిలీజైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కార్తికేయ  మాట్లాడుతూ– ‘‘కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. ఈమూవీ డైలాగ్స్‌ను ఏడెనిమిది రోజుల్లో రాసి డబ్బింగ్‌ కూడా పూర్తి చేసిన ఆదిత్యకి ధన్యవాదాలు’’ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement