Actor Dhanush's next movie with Trisha Krishnan - Sakshi
Sakshi News home page

ధనుష్‌ సరసన త్రిష?.. ఆమె పాత్ర ఇదేనా?

Jun 5 2023 12:45 AM | Updated on Jun 5 2023 9:03 AM

Dhanush next movie with Trisha - Sakshi

ధనుష్‌ సరసన త్రిష నటించనున్నారా? అంటే అవుననే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ధనుష్‌ కెరీర్‌లోని 50వ సినిమాను సన్‌పిక్చర్స్‌ నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ధనుష్‌ సరసన త్రిష నటించనున్నారా? అంటే అవుననే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ధనుష్‌ కెరీర్‌లోని 50వ సినిమాను సన్‌పిక్చర్స్‌ నిర్మించనున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ధనుష్‌ స్వీయ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్‌ పాత్రకే త్రిషను సంప్రదించిందట చిత్రంయూనిట్‌.

కథ విన్న త్రిష కూడా ఈ సినిమాలో యాక్ట్‌ చేసేందుకు సుముఖంగానే ఉన్నారట.  ఇదిలా ఉంటే... 2016లో వచ్చిన ‘కొడి’(తెలుగులో ‘ధర్మయోగి’) చిత్రంలో ధనుష్‌కు జోడీగా త్రిష కనిపించారు. అయితే ఈ చిత్రంలో త్రిష పాత్ర కాస్త నెగటివ్‌ టచ్‌తో ఉంటుంది. మరి..ధనుష్‌తో మరోసారి త్రిష స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement