ఓటీటీలో ధనుష్‌ సినిమా: అప్పటినుంచే ప్రసారం..

Dhanush Karnan To Stream On Amazon Prime: Check For Release Date - Sakshi

తమిళ హీరో ధనుష్‌ ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా ఇచ్చాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన జగమే తంత్రం సినిమా నేరుగా ఓటీటీ బాట పట్టిన విషయం తెలిసిందే కదా! ఈ చిత్రం జూన్‌ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తాజాగా అతడి మరో సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్‌ కాబోతోంది. ధనుష్‌ ప్రధాన పాత్రలో నటించిన కర్ణన్‌ సినిమాకు అమెజాన్‌ ప్రైమ్‌తో మంచి డీల్‌ కుదిరింది.

దీంతో ఈ చిత్రం ప్రైమ్‌ వీడియోలో మే 14 నుంచి ప్రసారం కానుంది. ఏప్రిల్‌ 9న థియేటర్‌లో రిలీజై బాక్సాఫీస్‌ దగ్గర కోట్ల వర్షం కురిపించిన ఈ సినిమా నెల రోజులకే ఓటీటీలోకి వస్తుండటంతో అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మాలి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లాల్‌, రాజీశ విజయన్‌, నాట్టీ, యోగి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. వి క్రియేషన్స్‌ నిర్మించాయి.

చదవండి: OTT: మేలో అలరించనున్న సినిమాలివే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top