Devatha : రుక్మిణి ప్రశ్నలకు షాకైన సత్య-ఆదిత్యలు

Devatha Serial : Adithya And Satya Land In A Tight Spot When Rukmini Questions - Sakshi

కృష్ణ-సత్యభామల బొమ్మ తన వద్ద ఎక్కడినుంచి వచ్చిందని రుక్మిణి ఆదిత్యను నిలదీస్తుంది. దీంతో షాకైన ఆదిత్య ఎవరో కావాల్సిన వారు ఇచ్చారంటూ మాట దాటేస్తాడు. సీన్‌ కట్‌ చేస్తే..సత్య గదిలోంచి ఆదిత్య రావడాన్ని చూసిన రుక్మిణి వాళ్లిద్దరి మధ్యా తానే అడ్డుగా ఉన్నానా అని ఆలోచిస్తుంది. మరోవైపు తాను ఇచ్చిన బొమ్మ ఎక్కడ ఉందంటూ రుక్మిణి సత్యను ప్రశ్నిస్తుంది. ఇక తన అనుమానం మరింత బలపడిందని రుక్మిణి భావిస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్‌ విశేషాలను ఈ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. దేవత సీరియల్‌ మే2న 249వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో చూసేయండి..

దేవత మే2 ఎపిసోడ్‌: ఆదిత్య లాకర్‌లో తాను సత్యకు బహుమతిగా ఇచ్చిన కృష్ణ-సత్యభామల బొమ్మ చూసి రుక్మిణి షాకవుతుంది. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆదిత్యేనా అని అనుమానపడుతుంది. తన అనుమానం నిజం కాకూడదంటూ దేవుణ్ని ప్రార్థిస్తుంది. ఇక ఆ బొమ్మ ఎక్కడిదంటూ రుక్మిణి ఆదిత్యని నిలదీయడంతో ఆదిత్య ఆశ్చర్యపోతాడు. ఎవరో కావాల్సిన వాళ్లు ఇచ్చుంటారంటూ ఆదిత్య సందేహిస్తూ చెప్తాడు. ఇక ఇదే విషయాన్ని ఆదిత్య  సత్యతో చెప్తాడు. దీంతో తమ విషయం ఎక్కడ బయటపడిపోతుందేమో అని సత్య కంగారుపడిపోతుంది. ఆ బొమ్మ స్వయంగా రుక్మిణి తన చేత్తో తయారు చేసిందని, ఇప్పుడు తనకు ఏం సమాధానం చెప్పాలంటూ ఆలోచిస్తుంది.

సరిగ్గా అప్పుడే రుక్మిణి అటువైపు వస్తుండడాన్ని గమనించిన ఆదిత్య సత్య గదిలోంచి జారుకునే ప్రయత్నం చేస్తుండగా రుక్మిణి ఆదిత్యని కనిపెడతుంది. సత్య గదిలోకి ఎందుకు వెళ్లాలంటూ అడగ్గా ఏదో ఎగ్జామ్స్‌ కోసమని చెప్పి ఆదిత్య వెళ్లిపోతాడు. సీన్‌కట్‌ చేస్తే తాను పూజ చేస్తున్న సమయంలో సత్యను కూడా అక్కడకి వచ్చి హారతి తీసుకోమని రుక్మిణి అడుగుతుంది. అయితే దేవుణ్ని దండం పెట్టుకుంటుండగా అక్కడ కృష్ణ-సత్యభామల బొమ్మ చూసి సత్య కంగు తింటుంది. ఇక తాను బహుమతిగా ఇచ్చిన బొమ్మ ఎక్కడుందంటూ సత్యను అడగ్గా అది పాండిచ్చెరిలోనే ఉండిపోయిందని చెప్పి సత్య అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. దీంతో సత్య-ఆదిత్యలపై రుక్మిణికి అనుమానం బలపడుతుంది. ఇద్దరూ మాటల్లో తడబాటును రుక్మిణి గమనిస్తుంది. మరి ఈ నిజాన్ని రుక్మిణి ఎలా తెలుసుకుంటుంది అన్నది తర్వాతి ఎపిసోడ్‌లో చూద్దాం. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top