
ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం బేబి. ఈ సినిమాకి సాయి రాజేశ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవీ చైతన్య ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఓ రెండు మేఘాలిలా సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాపై మరింత బజ్‌ను క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ని విడుదల చేశారు మేకర్స్.
దేవరాజా అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. ఇందులో వైష్ణవి డీగ్లామర్‌గా కనిపించనుంది. అమాయకంగా కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చే సీన్లతో మొదలైన పాట ఆ తర్వాత మోడ్రన్ స్టైల్‌లోకి కనిపించేవరకు సాగుతుంది. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.