Brahmastra Movie Song: 'బ్రహ్మాస్త్రం' నుంచి 'దేవ దేవ' సాంగ్‌ రిలీజ్‌

Deva Deva Song Out From Brahmastra Movie - Sakshi

Deva Deva Song Out From Brahmastra Movie: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్‌. 

ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, సాంగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా 'కుంకుమల' వీడియో సాంగ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. తాజాగా 'దేవ దేవ' అనే మరో పాటను విడుదల చేశారు. ప్రీతమ్‌ స్వరపరిచిన ఈ సాంగ్‌కు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాట ఆధ్యాత్మికతతో ఉల్లాసభరితంగా సాగింది. ఈ పాట గురించి 'నేను ఈ సాంగ్‌ను పూర్తిగా ఆస్వాదించాను. ఈ పాటతో ఆధ్యాత్మికంగా శక్తివంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ అనుభూతి పొందుతారని నేను ఆశిస్తున్నాను' అని రణ్‌బీర్‌ కపూర్ తెలిపాడు. 

'ఈ పాటను విడుదల చేసేందుకు శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను' అని డైరెక్టర్‌ అయాన్ ముఖర్జీ పేర్కొన్నాడు. కాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల చేయ‌నున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top