మళ్లీ హాలీవుడ్‌కి హాయ్‌ అంటున్న బాలీవుడ్‌ బ్యూటీ..!

Deepika Padukone Confirms Her Hollywood Comeback - Sakshi

మూడేళ్ల క్రితం ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌’ చిత్రంతో హాలీవుడ్‌కి హాయ్‌ చెప్పారు బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌. మరోసారి హాలీవుడ్‌ తెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈసారి రెండు బాధ్యతలతో హాలీవుడ్‌ సినిమా చేయనున్నారామె. ఒకటి నటిగా.. ఇంకో బాధ్యత నిర్మాతగా. ఎస్‌టీఎక్స్‌ ఫిలిమ్స్, టెంపుల్‌ హిల్‌ ప్రొడక్షన్స్‌తో కలసి దీపికా సొంత బేనర్‌ ‘కా’ ఈ హాలీవుడ్‌ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది క్రాస్‌ కల్చర్‌ రొమాంటిక్‌ మూవీ. అంటే... భిన్న భాషలు, సంస్కృతులకు చెందినవారి నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో నటించనున్న నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ‘‘ప్రపంచానికి క్రాస్‌ కల్చర్‌ కథ లను చూపించడానికే బేనర్‌ ఆరంభించాను. మరిన్ని క్రాస్‌ కల్చర్‌ ప్రాజెక్ట్స్‌తో రానున్నాం’’ అన్నారు దీపికా పదుకోన్‌. ఇదిలా ఉంటే.. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’లో దీపికా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top