breaking news
Triple X
-
మళ్లీ హాలీవుడ్‌కి హాయ్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ..!
మూడేళ్ల క్రితం ‘ట్రిపుల్ ఎక్స్: రిటర్న్ ఆఫ్ ది జాండర్ కేజ్’ చిత్రంతో హాలీవుడ్‌కి హాయ్ చెప్పారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్. మరోసారి హాలీవుడ్ తెరపై కనిపించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈసారి రెండు బాధ్యతలతో హాలీవుడ్ సినిమా చేయనున్నారామె. ఒకటి నటిగా.. ఇంకో బాధ్యత నిర్మాతగా. ఎస్టీఎక్స్ ఫిలిమ్స్, టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్‌తో కలసి దీపికా సొంత బేనర్ ‘కా’ ఈ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మించనుంది. ఇది క్రాస్ కల్చర్ రొమాంటిక్ మూవీ. అంటే... భిన్న భాషలు, సంస్కృతులకు చెందినవారి నేపథ్యంలో సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో నటించనున్న నటీనటులు, దర్శకుడు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ‘‘ప్రపంచానికి క్రాస్ కల్చర్ కథ లను చూపించడానికే బేనర్ ఆరంభించాను. మరిన్ని క్రాస్ కల్చర్ ప్రాజెక్ట్స్‌తో రానున్నాం’’ అన్నారు దీపికా పదుకోన్. ఇదిలా ఉంటే.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో దీపికా కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. -
ఆయన బిడ్డలకు నేను తల్లయ్యా!
‘ఆలూ లేదూ.. చూలూ లేదూ.. కొడుకు పేరు సోమలింగం’ అన్నారట వెనకటికెవరో. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె వరుస కూడా అలానే ఉంది. ఇప్పటివరకూ పలువురితో ప్రేమాయణం సాగించి, తాజాగా రణ్‌వీర్‌సింగ్‌తో ప్రేమలో ఉన్న ఈ భామ పెళ్లిపీటలు మాత్రం ఎక్కలేదు. కానీ, ‘నేను హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌తో పిల్లల్ని కన్నాను’ అంటూ ఓ టీవీ ప్రోగ్రాంలో దీపిక పేర్కొనడం సంచలనమైంది. ఆ తర్వాత ఆమె ఏం చెప్పబోతున్నారో పూర్తిగా వినకుండా, దీపిక గర్భంతో ఉన్నట్లు ఎప్పుడూ కనిపిం చలేదే? ఒకవేళ ‘ట్రిపుల్ ఎక్స్’ చేస్తూ, అమెరికాలో ఉన్న సమయంలో పిల్లల్ని కన్నారా? అని కొందరు ఊహించుకోవడం మొదలు పెట్టారు. ఈలోపు అసలు విషయాన్ని దీపిక చల్లగా చెప్పారు. ఆ విషయంలోకి వస్తే.. దీపికా, విన్ నటించిన ‘ట్రిపుల్ ఎక్స్’ ఇండియాలో విడుదలైంది. త్వరలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా వ్యాఖ్యాత ‘ఎలెన్ డిజెనరస్’ నిర్వహించిన టీవీ షోలో పాల్గొన్నారు దీపిక. ‘విన్కీ, మీకూ మధ్య ఏదో ఉందనే ప్రచారం నిజమేనా?’ అని ఎలెన్ అడిగిన ప్రశ్నకు దీపిక » దులిస్తూ.. ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా? అది నిజమే. విన్ అంటే నాకిష్టం. మేం కలిసి ఉన్నాం. మాకు అందమైన పిల్లలు కూడా పుట్టారు. అయితే ఇదంతా కేవలం నా ఊహల్లోనే’’ అని తెలివిగా సమాధానం చెప్పారు. ఎంతైనా బాలీవుడ్ భామ భలే గడుసు కదూ!