దీపికాతో తొలిసారి జోడీగా.. | Deepika Padukone And Siddhant Chaturvedi First Movie | Sakshi
Sakshi News home page

దీపికాతో తొలిసారి జోడీగా..

Dec 5 2020 2:12 PM | Updated on Dec 5 2020 2:27 PM

Deepika Padukone And Siddhant Chaturvedi First Movie - Sakshi

న్యూఢిల్లీ: దీపిక పదుకొనే, సిద్ధాంత్‌ చత్రుర్వేది మొదటిసారి జోడి కట్టనున్నారు. షకున్‌ బాత్రా దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కలిసి నటించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రదేశాలను చూడటానికి ముంబయిలోని అలిబాగ్‌ను సందర్శించారు. వీరిద్దరు. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. నిజ జీవితంలో వీరి మధ్య ఏ రిలేషన్‌ లేకపోయినప్పటికీ దీపిక ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫోటోలను చూస్తుంటే కెమిస్ట్రి బాగా ఉన్నట్లు కనిపిస్తోంది.  ఈ చిత్రంలో నటి అనన్య పాండే కూడా నటించనున్నట్ల తెలుస్తుంది. అలీబాగ్‌ షెడ్యూల్‌లో దీపికా, సిద్దాంత్‌లతో పాటు అనన్య తరచూ కనిపిస్తూనే ఉన్నారు. (చదవండినన్ను దారుణంగా తిడుతున్నారు..)

‘ఐ లవ్‌ యూ దీపిక పదుకొనే, నేను హగ్‌ చేసుకున్న ఒకే ఒక్క పర్సన్‌ నువ్వు’ అంటూ అనన్య పాండే తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన పోస్ట్‌ బాగా ట్రెండ్‌ అవుతుంది. షకున్‌ బాత్రా తీయబోయే ఈ చిత్రం రిలేషన్‌ డ్రామాకు సంబంధించినది. ఈ ఏడాది గోవాలో షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. చివరికగా ఛపాక్‌లో కనిపించిన దీపికా..రణవీర్‌ నేతృత్వంలో కబీర్‌ ఖాన్‌ 83 చిత్రంలో కూడా చిన్న పాత్రను పోషించింది.   దీపిక భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో ‘గల్లీ భాయ్’‌ చిత్రంలో సిద్దాంత్‌ చతుర్వేది కలిసి నటించాడు. యష్‌ రాజ్‌ నిర్మించనున్న ‘బంటి ఔర్‌ బబ్లీ2’లో కూడ సిద్దాంత్‌ కనిపించనున్నారు. అనన్య పాండే చివరిగా ‘ఖాలి పీలి’ చిత్రంలో కనిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement