వణక్కమ్ దీపికా

దీపికా పదుకోన్‌కి తమిళ పరిశ్రమ వణక్కమ్ చెప్పబోతోందని సమాచారం. అంటే.. స్వాగతం అని అర్థం. విషయం ఏంటంటే... తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందనున్న ఓ చిత్రంలో దీపికాను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ప్యాన్ ఇండియా మూవీలో దీపిక హీరోయిన్‌గా నటించనున్న విషయం తెలిసిందే. ఇటు తెలుగు సినిమాకి సై అన్న దీపికా అటు తమిళ చిత్రాన్ని కూడా ఒప్పుకోవాలనుకుంటున్నారట.
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం విజయ్‌కి 65వ సినిమా కావడం విశేషం. ఈ సినిమాలో విజయ్‌కి ప్రతినాయకుడిగా బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాం నటించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాని రూపొందించనుందట. అందుకే భారీ తారాగణం ఉండేలా చూస్తున్నారని కోలీవుడ్ టాక్. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో ‘డాక్టర్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు నెల్సన్ దిలీప్‌కుమార్. ఆ సినిమా పూర్తయ్యాక విజయ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళతారట. కాగా విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి