శిక్షణ పొందిన అకాడమీ విద్యార్థులతో కొత్త సినిమా.. | Sakshi
Sakshi News home page

శిక్షణ పొందిన అకాడమీ విద్యార్థులతో కొత్త సినిమా..

Published Mon, Jun 27 2022 1:46 PM

De Sales International Film Academy Students Movie Announced - Sakshi

చైన్నై సినిమా: ఫిల్మ్‌ అకాడమీ విద్యార్థుల కోసం చిత్ర నిర్మాణం చేపట్టడం అనే కొత్త ప్రయత్నానికి డీసెల్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిలీం మీడియా శ్రీకారం చుట్టింది. నటన, దర్శకత్వం, ఛాయాగ్రహణం తదితర శాఖల్లో శిక్షణ ఇస్తున్న ఈ అకాడమీ తమ స్టూడెంట్స్‌ కోసం ఏడాదిలో చిత్రాన్ని నిర్మించనుంది. మొదటి ప్రయత్నంగా ఈ అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తూ 'అట్టై తింగళ్ అన్ని లవిల్‌' అనే వైవిధ్య భరిత ప్రేమకథా చిత్రాన్ని నిర్మించారు. 

తాజ్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ఆర్‌సి. అయ్యప్పన్‌ నిర్మించిన ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలను ఎస్‌ఎస్‌ జయకుమార్‌ వారన్ నిర్వహించారు. ఈయన గతంలో దర్శకుడు కె. భాగ్యరాజ్, ఎస్‌జె సూర్య, తిరుమురుగన్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. 

చదవండి:👇
తల్లి కాబోతున్న స్టార్‌ హీరోయిన్
హార్ట్‌ సింబల్స్‌తో సమంత ట్వీట్‌.. నెట్టింట వీడియో వైరల్‌..
మరో నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్‌ కేసులో నిందితుడు
ఒకేసారి రిపీట్‌ కానున్న 10 జంటలు..

Advertisement
 
Advertisement
 
Advertisement