Keerthy Suresh's costly gifts to 'Dasara' movie unit members - Sakshi
Sakshi News home page

Keerthy Suresh: దసరా మూవీ సెట్‌లో కాస్ట్‌లీ గిఫ్ట్స్‌ పంచిన హీరోయిన్‌!

Jan 20 2023 10:47 AM | Updated on Jan 20 2023 2:51 PM

Dasara Movie: Keerthy Suresh Costly Gifts To Unit Members - Sakshi

షూటింగ్‌ చివరి రోజు ఈ మహానటి చిత్రయూనిట్‌కు మర్చిపోలేని బహుమతిచ్చిందట. 130 మందికి

హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ ప్రస్తుతం భోళా శంకర్‌లో చిరంజీవికి చెల్లిగా, దసరాలో నానికి జోడీగా నటిస్తోంది. ఈ రెండు కాకుండా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో మామన్నన్‌, శింబుతో మరో సినిమా చేస్తోంది. అలాగే రఘ్‌తథా అనే లేడీ ఓరియంటెడ్‌ మూవీలోనూ నటిస్తోంది. చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది కీర్తి. 

ఇకపోతే కీర్తి సురేశ్‌ కథానాయికగా నటించిన దసరా షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. షూటింగ్‌ చివరి రోజు ఈ మహానటి చిత్రయూనిట్‌కు మర్చిపోలేని బహుమతిచ్చిందట. 130 మందికి రెండు గ్రాముల గోల్డ్‌కాయిన్స్‌ కానుకగా అందించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిందట.​ ఇందుకోసం ఆమె దాదాపు పదమూడు లక్షల మేర ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

దసరా సినిమా విషయానికి వస్తే.. నాని హీరోగా నటించిన ఈ మూవీకి శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం మార్చి 30న రిలీజ్‌ కానుంది.

చదవండి: ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మంచు మనోజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement