'What The Fish': Manchu Manoj announced his next movie title - Sakshi
Sakshi News home page

Manchu Manoj: ఫోటో షేర్‌ చేసి మరీ గుడ్‌న్యూస్‌ చెప్పిన మంచు వారబ్బాయి

Jan 20 2023 9:54 AM | Updated on Jan 20 2023 10:23 AM

What The Fish: Manchu Manoj To Announce His Next Movie Crazy Title - Sakshi

కొంతకాలంగా ఊరిస్తూ వచ్చిన మంచు మనోజ్‌ ఎట్టకేలకు శుభవార్త చెప్పాడు.

త్వరలో కొత్త జీవితం ప్రారంభించబోతున్నా అంటూ కొంతకాలంగా ఊరిస్తూ వచ్చిన మంచు మనోజ్‌ ఎట్టకేలకు శుభవార్త చెప్పాడు. కానీ అందరూ అనుకున్నట్లుగా పెళ్లి గురించి కాదు.. కొత్త సినిమా గురించి! వెండితెరపై కనిపించి చాలా ఏళ్లవుతున్న సందర్భంగా తన న్యూ ప్రాజెక్ట్‌ ప్రకటించాడు.

'నేను సినిమాలు చేసి చాలాకాలం అవుతోంది. అయినప్పటికీ మీరు నాపై ప్రేమ కురిపిస్తూనే ఉన్నారు. మీరు చూపిస్తున్న ప్రేమకు ఎంతోకొంత తిరిగివ్వాల్సిన సమయం వచ్చేసింది. వాట్‌ ద ఫిష్‌ అనే కొత్త సినిమాతో మీముందుకు రాబోతున్నా. ఈ మూవీ మీ అందరికీ కచ్చితంగా క్రేజీ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది' అని ట్వీట్‌ చేశాడు. దీనికి తన సినిమా పోస్టర్‌ను సైతం జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు 'మొత్తానికి రీఎంట్రీ ఇస్తున్నావు, అది చాలు', 'మరి అహం బ్రహ్మాస్మి సంగతేంటి?', 'పోస్టర్‌ బాగుంది. కానీ మేమింకా పెళ్లి గురించి అనుకున్నామే' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

చదవండి: కొత్త ఇల్లు కొన్న త్రిష, ఎన్ని కోట్లో తెలుసా?
ఖాకీ చొక్కా వేసుకుని తుపాకీ పట్టిన హీరోయిన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement