Trisha: కొత్త ఇల్లు కొన్న త్రిష.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Trisha Bought New House Worth RS 35 Crore - Sakshi

పొన్నియిన్‌ సెల్వన్‌ ఇచ్చిన నూతనోత్సాహంతో నటి త్రిష దుమ్మురేపుతున్నారనే చెప్పాలి. ఈమె సినీ కెరీర్‌ పొన్నియిన్‌ సెల్వన్‌కు ముందు, ఆ తరువాత అన్నట్లుగా సాగుతోంది. నాలుగు పదుల వయసులో ఈ బ్యూటీకి మణిరత్నం రూపంలో గొప్ప అదృష్టం తలుపు తట్టింది. పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంలో కుందవైగా త్రిష మెరిసి మురిపించారు. దీంతో ఆ చిత్రం పార్టు– 2పై ఆసక్తి నెలకొంది.

కాగా ఇటీవల రాంగీ చిత్రంలో త్రిష  యాక్షన్‌ హీరోయిన్‌గా అదరగొట్టారు. ఈమె నటించిన చతురంగవేట్టై – 2 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కోసం ఎదురు చూస్తోంది. ప్రస్తుతం రామ్‌ పార్టు –1, ది రోడ్డు చిత్రాల్లో నటిస్తున్నారు.  తాజాగా నటుడు విజయ్‌తో ఆయన 67వ చిత్రంలో నటించే లక్కీచాన్స్‌ త్రిషను వరించింది. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది.

అదే విధంగా అజిత్‌ 62వ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ చిత్రంలో త్రిష నటించడం లేదు. కాగా ఈ భామ ఇంతకు ముందు నటుడు అజిత్‌ ఇంటి సమీపంలో రూ.5 కోట్లతో ఓ ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అందులో ఆమె నివశిస్తుందో లేదో తెలియదు గానీ, తాజాగా నటుడు విజయ్‌ ఇంటి సమీపంలో రూ.35 కోట్లతో ఓ ఇంటిని కొన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ఇంటిలోనే త్రిష నివశించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top