డాన్స్‌ డాన్‌ గురు స్టెప్స్‌ అవార్డుల వేడుక | Sakshi
Sakshi News home page

డాన్స్‌ డాన్‌ గురు స్టెప్స్‌ అవార్డుల వేడుక

Published Sun, Dec 10 2023 4:21 PM

Dance Guru Dance Steps Awards 2023 Tamil Movie News - Sakshi

1950 నుంచి 2023 వరకు ఇండియన్‌ సినిమాలో డ్యాన్స్, సాంగ్స్ లేని సినిమా లేదు. వీటికి సినిమాలో అంత ప్రాధాన్యం ఉంటుంది. అలా ఈ నృత్య రంగంలో ఎందరో ప్రతిభావంతులు విశేష సేవలు అందించారు. అలాంటి వారి గురించి ఈ డిజిటల్‌ యుగంలో చాలా మందికి తెలియదు. వారి గురించి వారి సేవల గురించి వివరించే విధంగా ఈ నెల 30వ తేదీన చైన్నెలో ప్రముఖ నృత్య దర్శకుడు, కలైమామణి శ్రీధర్‌ మాస్టర్‌ నేతృత్వంలో డాన్స్‌ డాన్‌ గురు స్టెప్స్‌ కోలీవుడ్‌ అవార్డ్స్‌ పేరుతో అవార్డుల ప్రధాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరగనుంది. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా చెన్నై మీడియా మీటింగ్ ఏర్పాటు చేశారు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!)

ఇందులో మాస్టర్‌తో పాటు అక్షర శ్రీధర్‌, అశోక్‌, భాస్కర్‌, లలితమణి, కుమార్‌ శాంతి, వసంత, విమల, సంపత్‌, హరీష్‌ కుమార్‌, మాలిని, వీకేఎస్‌ బాబు తదితర నృత్య దర్శకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమా ప్రారంభ కాలం నుంచి పలువురికి డాన్సులు శిక్షణ ఇచ్చిన నృత్య డాన్స్‌ల ప్రతిభ గురించి వారి చరిత్ర గురించి వివరించే విధంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. 

ఈ కళా రంగంలో మనకు ముందు సాధించిన కళాకారుల సాధన గౌరవించే విధంగా వారి చరిత్రను తెలియజేస్తూ స్మరించుకునే విధంగానూ, జిల్లాలోని విశ్రాంతి దర్శకులను ఈ కార్యక్రమంలో తగిన రీతిగా సత్కరించనున్నట్లు తెలిపారు. డిసెంబర్‌ 30వ తేదీన స్థానిక తేనాంపేటలోని కామరాజర్‌ ఆవరణంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించినున్నట్లు తెలిపారు. కాగా ఈ సందర్భంగా ఆది గాంధారి సాంగ్‌ ఆల్బమ్‌ను ఆవిష్కరించారు.

(ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!)

Advertisement
Advertisement