Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్! | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 97 Highlights: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా?

Published Sat, Dec 9 2023 11:33 PM

Bigg Boss 7 Telugu Day 97 Epsiode Highlights - Sakshi

బిగ్‌బాస్ 7లో శివాజీ ఓ చెదపురుగు. పురుగు వల్ల చెక్క అంతా డ్యామేజ్ అయినట్లు.. సోఫాజీ అలియాస్ శివాజీ వల్ల ఈ సీజన్ తీరే దెబ్బతినేసింది. దీన్ని బాగుచేయడం నాగ్ వల్ల కూడా కాదు. అయినా సరే పెద్దాయన ముసుగు వేసుకున్న ఈయన ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. స్వయంగా నాగార్జున.. నువ్వు చేసింది తప్పురా బాబు అని చెబుతున్నాసరే ఒప్పుకోలేదు. శివాజీ ఒక్కడికే కాదు ఇతడి బ్యాచ్ మొత్తానికి గట్టిగా పడ్డాయి. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 97 ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.

అర్జున్-ప్రియాంక ఫర్ఫెక్ట్ ప్లేయర్స్
వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. శుక్రవారం సంగతులన్నీ చూశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రియాంక, అర్జున్ మాత్రం సేవ్ అయ్యాడు. ఫినాలే వీక్‌కి చేరుకున్నా సరే ఈ వారమంతా గేమ్స్ ఆడి, ఒక్కటంటే ఒక్క తప్పు చేయని అర్జున్.. జస్ట్ ఒకే ఒక్క ఫౌల్ చేసిన ప్రియాంకని నాగ్ మెచ్చుకున్నాడు. దీనిబట్టి చూస్తే ప్రియాంక కూడా ఫినాలే వీక్‌కి ఆల్మోస్ట్ చేరిపోయినట్లే ఓ క్లారిటీ వచ్చేసింది.

(ఇదీ చదవండి: మెగాహీరో రామ్ చరణ్‌కు మరో గ్లోబల్ అవార్డ్)

శోభాకి స్మూత్‌గా కౌంటర్స్
ఫస్ట్ ఫస్ట్ శోభా ఫేస్ ఉన్న మార్బెల్ పగలగొట్టిన నాగ్, ఆమెని కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. అలా ఆమెతో పర్సనల్‌గా మాట్లాడాడు. అయితే వెళ్తున్నప్పుడే ఆమె భయపడుతూ వెళ్లింది. దీన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు. అసలేమైంది? శివాజీతో గొడవ ఎందుకు? అని నాగ్ అడగ్గా.. 'తెలుగమ్మాయిలు కాదు, ఫేవరిజం అని శివాజీ పదేపదే అంటున్నారు. కొన్నికొన్నిసార్లు ప్రియాంక, నాతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలానే ప్రతిసారి గ్రూపిజం, గ్రూపిజం అని అంటున్నారు. దీని గురించి మాట్లాడుదామని అనుకున్నాను కానీ కుదర్లేదు' అని శివాజీతో వాదనపై శోభా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. 

అయితే నువ్వు అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావ్, ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నావ్ అని నాగ్, శోభాపై సీరియస్ అయ్యాడు. హౌస్ వాతావరణం కూడా నీ వల్ల కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. దీంతో నాగ్ రూట్ మార్చాడు. ఆడపిల్ల ఏడిస్తే షోకి మళ్లీ బ్యాడ్ నేమ్ రావొచ్చని.. ఏమైంది శోభా చెప్పు? అని చాలా స్మూత్ గా అడిగాడు.  అయితే వెళ్లిపోతానేమోనని భయమేస్తుంది సర్, అందుకే అలా అని నాగ్ ప్రశ్నలకు శోభా ఆన్సర్ చెప్పుకొచ్చింది.

యావర్ అస్సలు మారడు
శోభా తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. శోభాని 'చీ..థూ' అని అనడంపై సీరియస్ అయ్యాడు. ఆ ప్రవర్తన బాగుందా? వరస్డ్ బిహేవియర్ అని అన్నాడు. మధ్యలో యావర్.. తనది తప్పు కాదని సమర్థించుకోవడానికి తెగ ప్రయత్నించాడు. దీంతో నాగ్ సీరియస్ అయ్యాడు. నిన్ను చూసిన మాకు ఏమనిపించిందంటే.. ఇది యావర్ నిజస్వరూపం, ఇప్పుడు బయటకొచ్చింది అని నాగ్.. యావర్ గురించి స్మూత్‌గా నిజాలు చెప్పేశాడు. నీది తప్పు, బయటకెళ్లి శోభాకి మనస్పూర్తిగా సారీ చెప్పు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవలో శోభాది కూడా తప్పు ఉందని యావర్, మళ్లీ మళ్లీ అదే పాట పాడేసరికి.. ఇక నీకు చెప్పలేను, దండంరా బాబు అని నాగ్ తన విసుగు చూపించాడు.

(ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!)

రైతుబిడ్డ మస్త్ యాక్టింగ్
రైతుబిడ్డని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. అతడి నిజస్వరూపాన్ని, ఆస్కార్ లెవల్ యాక్టింగ్ బయటపెట్టాడు. చెప్పు ప్రశాంత్.. నీకు ఏ వీడియోలు చూపించాలి అని నాగ్ వంగిమరీ దండం పెడుతూ సెటైరికల్‌గా మాట్లాడాడు. ఎందుకు ప్రశాంత్ నీకు అందరి మీద అపనమ్మకం ఉంది? నువ్వు అడిగిన ప్రతి వీడియో చూపించడానికి ఉన్నాడా బిగ్ బాస్? అని నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నాగ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అతడిని కూడా ఏమార్చడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. చెప్పింది వినరా బాబు అని సైలెంట్ చేశాడు.

 

ఇక అమర్ కొరికేశాడని ప్రశాంత్ సీన్ చేసిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఏమో బ్లడ్ వచ్చిందని రైతుబిడ్డ అన్నాడు. అయితే డాక్టర్‌తో ఇప్పుడే మాట్లాడానని చెప్పిన నాగ్.. నో టూత్ మార్క్, నో బ్లడ్ అని అసలు విషయం చెప్పాడు. అదికాదు సర్ చేయి ఉబ్బిపోయిందని రైతుబిడ్డ మాట మార్చేశాడు. మధ్యలో అర్జున్ కూడా పిలిచిన నాగ్.. ప్రశాంత్‌ని అమర్ కొరకలేదని, జస్ట్ పట్టి వదిలేశాడని చెప్పాడు. జరిగిన దానికి, నువ్వు అక్కడ చేసినదానికి ఎంత సీన్ చేశావ్ తెలుసా? అని నాగ్ ప్రశాంత్‌పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. మిగతా విషయాల్లో ఎంతో నొప్పి భరించావ్ కానీ అమర్ దగ్గరకొచ్చేసరికి తప్పు ఎక్కడ చేస్తాడా అని ఎదురుచూస్తున్నావ్.. అమర్ విషయంలో పెట్టిన శ్రద్ధ ఆట విషయంలో పెట్టుంటే బాగుండేదని నాగ్ అన్నాడు. అలానే ఈ హౌసులో నువ్వు శివాజీ సేవకుడివా? గులంవా? అని నాగ్ సీరియస్ అయ్యాడు. నాగ్ చెబుతుంటే ప్రశాంత్ అడ్డు తగిలాడు. ప్రశాంత్ నువ్వు చేసిందే తప్పు, అటుఇటు తీసుకెళ్లకు అని నాగ్ కౌంటర్ ఇచ్చాడు. 

(ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!)

శివాజీ ఓ వరస్డ్ కేండిడేట్
శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగార్జున.. ఇన్నివారాలు సపోర్ట్ చేసినట్లు కాకుండా సీరియస్ అయ్యాడు. ఇప్పటికీ మాట్లాడకపోతే షోని ప్రేక్షకులు చూడటం మానేస్తారని తెలుసు. అందుకే నాగ్ ఈసారి తెచ్చిపెట్టుకుని మరీ శివాజీపై సీరియస్ అయ్యాడు. ఆడపిల్లలని పీకుతా అని శివాజీ అన్న కామెంట్‌పై నాగ్.. వివరణ అడిగాడు. ప్రశాంత్‌ని గత రెండు వారాల నుంచి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురిపై(శోభా-అమర్-ప్రియాంక) సీరియస్ అయ్యానని అన్నాడు. నువ్వు చేసింది తప్పు శివాజీ అని నాగ్ బల్లగుద్ది చెబుతున్నాసరే.. తనని తాను చాలా సమర్థించుకున్నాడు. ప్రేక్షకుల్లోని అమ్మాయి తన బాధ చెబుతున్నా సరే.. ఆమెతో కూడా వాదించాడు తప్పితే తాను చేసింది తప్పని శివాజీ ఒప్పుకోలేదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంత మీద కాలేసి తొక్కుతా అని శివాజీ కామెంట్ చేసి మరో వీడియోని నాగ్ చూపించాడు. అయితే అది కోపం, ఫ్రస్టేషన్ వల్ల వచ్చింది బాబుగారు అని శివాజీ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఫ్లోలో వచ్చిన మాట తప్పితే.. వాంటెడ్ గా అన్న మాట కాదు అని శివాజీ ఓ పనికిమాలిన రీజన్ చెప్పాడు. దీనిబట్టి శివాజీ.. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అనేది అర్థమైపోయింది.

అమర్‌కి గట్టిగా పడ్డాయ్
ఈ వారం నిజంగా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించిన అమర్‌ని కూడా నాగ్ ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఏమైంది అమర్, నీకు పిచ్చెక్కిందా? కెప్టెన్ గా ఏంటా బిహేవియర్? అని.. ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూంలోకి తీసుకువెళ్లడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. యావర్, ప్రశాంత్ మీదనే ఎందుకలా చేస్తున్నావ్ అని సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో చపాతీలు కలపడం అనే ఓ చిన్న విషయాన్ని నాగ్ తీసుకొచ్చాడు. ఇంత సీరియస్ డిస్కషన్‌లో నాగ్ దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనేది అస్సలు అర్థం కాలేదు. అలానే నిజంగా 'పిచ్చి నా కొడుకు'లానే బిహేవ్ చేస్తున్నావ్ అని అమర్ ప్రవర్తన గురించి తన కోపాన్ని బయటపెట్టాడు. నన్ను కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు.. అమర్ ఎందుకలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని నాగ్ తనకెదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈవారం సేవింగ్ లాంటివి ఏం ఉండవు, ఫినాలేకి వెళ్లేది ఎవరో చెప్పడం మాత్రమే ఉంటుందని నాగ్ క్లారిటీ ఇవ్వడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇప్పటికే శివాజీ బ్యాచ్‌ని నాగార్జున వెనకేసుకొస్తున్నాడని అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ వాళ్లని తిట్టకపోతే షో పరువు పోతుందని నాగ్ తిట్టినట్లు అనిపించింది అంతే.

(ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు)

Advertisement
 
Advertisement