నెటిజన్‌ నుంచి అలాంటి ప్రశ్న.. వడలు బాగా తింటానని షాకిచ్చిన హీరోయిన్‌ | Daksha Nagarkar Funny Response On Who Comments On Thighs - Sakshi
Sakshi News home page

నెటిజన్‌ నుంచి అలాంటి ప్రశ్న.. వడలు బాగా తింటానని షాకిచ్చిన హీరోయిన్‌

Published Tue, Feb 6 2024 8:59 AM

Daksha Nagarkar Reply Her Fans Comments - Sakshi

హీరోయిన్‌ ధక్ష నగర్కర్‌  హోరాహోరి,హుషారు,రావణాసుర, జాంబీ రెడ్డి వంటి సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. కానీ నాగా చైతన్య బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో నాగచైతన్య-దక్ష మధ్య జరిగిన క్యూట్‌ వీడియో ఎంతగా వైరల్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరూ సైగలతో మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ అప్పట్లో వార్తలు పుట్టుకుచ్చాయి. అలా ఈ బ్యూటీ పాపులర్‌ అయింది. అమ్మాయిలందరి క్రష్‌ నాగ చైతన్య అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పి మరింత వైరల్‌ అయింది ఈ బ్యూటీ.

దక్ష నాగర్కర్ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. అప్పుడప్పుడు తన అభిమానులతో వీడియో కాల్‌ ద్వారా ముచ్చటిస్తుంది కూడా.. ఆ సమయంలో అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ అందరినీ ఫిదా చేస్తుంది.

నిత్యం హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారుకు దగ్గరైన దక్ష తాజాగా ఫ్యాన్స్‌తో తన ఇన్‌స్టాగ్రామ్‌లో క్వశ్చన్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. అందులో భాగంగా ఒక తుంటరి అభిమాని మీ 'థైస్‌'కు పెద్ద అభిమానిని అంటూనే.. ఆ సీక్రెట్‌ ఏంటో చెప్పాలని కోరుతాడు. దీంతో నెటిజన్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ. తానూ ఎప్పుడూ మసాలా వడలు తింటానని అందుకే తన 'థైస్‌' అలా ఉంటాయని ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి ప్రశ్ననను కూడా ధక్ష సీరియస్‌గా తీసుకోకుండా ఎంతో స్పోర్టివ్‌గా తీసుకుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది.

 
Advertisement
 
Advertisement