Comedian Vadivelu: విచారణకు హాజరుకావాల్సిందే!

Court Issues Summons To Comedian Vadivelu - Sakshi

Court Issues Summons To Comedian Vadivelu: విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని సినీ నటుడు వైగై పుయల్‌ వడివేలుకు గురువారం ఎగ్మూర్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. వడివేలు ఇంట్లో గతంలో ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాంబరం సమీపంలో రూ .1.93 కోట్లకు 3.5 ఎకరాల స్థలాన్ని విక్రయించి, దానిని ఐటీ లెక్కల్లో చూపించనట్లు అధికారులు గుర్తించారు. దీంతో వడివేలు కంగుతిన్నాడు. ఈ స్థలం విషయంలో సహచర నటుడు సింగముత్తు తనను మోసం చేసినట్టు ఆరోపిస్తూ..  ఆయన సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ను ఆశ్రయించారు.చదవండి: చార్లీ చాప్లిన్‌లా 'ఇస్మార్ట్‌ బ్యూటీ'

2007లో కొనుగోలు చేసిన ఈ స్థలాన్ని తన ప్రమేయం లేకుండా సింగముత్తుతో పాటుగా మరికొందరు విక్రయించినట్లు ఆరోపించారు. ఈ కేసు గత కొన్నేళ్లుగా ఎగ్మూర్‌ కోర్టులో ఉంది. కాగా విచారణకు రావాలని వడివేలుకు గతంలోనే సమన్లు జారీ అయ్యా యి. అయితే, ఆయన హాజరు కాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో గురువారం పిటిషన్‌ విచారణకు రాగా, సింగముత్తు తరపు న్యాయవాదులు హాజరై పన్ను ఎగవేత కేసు నుంచి తప్పించుకునేందుకు వడివేలు ప్రయత్నిస్తున్నట్లు తమ వాదనలు వినిపించారు.

ఆ స్థలాన్ని తాంబరం సమీపంలోని శేఖర్‌ అనే వ్యక్తికి విక్రయించి, ఇప్పుడేమో సింగముత్తు మోసం చేసినట్టు ఆరోపిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం విచారణకు తప్పక హాజరు కావాలని వడివేలుకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఎగ్మూర్‌కోర్టు న్యాయమూర్తి నాగరాజన్‌  డిసెంబర్‌ 7వ తేదీకి వాయిదా వేశారు.చదవండి:  ‘రిపబ్లిక్‌’ మూవీ చూసి రివ్యూ ఇచ్చిన టాలీవుడ్‌ పాప్‌ సింగర్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top