Comedian Raju Srivastav Regains Consciousness After 15 Days - Sakshi
Sakshi News home page

Comedian Raju Srivastava: గుండెపోటు.. 15 రోజుల తర్వాత స్పృహలోకి..

Aug 25 2022 4:26 PM | Updated on Aug 25 2022 5:19 PM

Comedian Raju Srivastav Regains Consciousness After 15 Days - Sakshi

అయితే ఆయన బ్రెయిన్‌ పని చేయడం ఆగిపోయిందని, అందరూ అతడి కోసం ప్రార్థించడంటూ ఇటీవల నటుడి సన్నిహితుడు సునీల్‌ పాల్‌ ఓ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే! ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించి 15 రోజుల తర్వాత కమెడియన్‌ స్పృహలోకి రావడంతో

గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన కమెడియన్‌ రాజు శ్రీవాస్తవ ఎట్టకేలకు స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడని నటుడి వ్యక్తిగత కార్యదర్శి గర్విత్‌ నారంగ్‌ గురువారం మీడియాకు వెల్లడించాడు. కాగా ఆగస్టు 10న జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రాజు శ్రీవాస్తవకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

అయితే ఆయన బ్రెయిన్‌ పని చేయడం ఆగిపోయిందని, అందరూ అతడి కోసం ప్రార్థించడంటూ ఇటీవల నటుడి సన్నిహితుడు సునీల్‌ పాల్‌ ఓ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే! ఎట్టకేలకు వైద్యుల కృషి ఫలించి 15 రోజుల తర్వాత కమెడియన్‌ స్పృహలోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: బెడ్‌రూమ్‌లో దొంగాపోలీసు ఆటలు ఆడలేదా? ఇబ్బంది పడ్డ హీరోయిన్‌
సూర్య కొత్త సినిమాకు శ్రీకారం.. దర్శకుడిగా ఆ మాస్‌ డైరెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement