కమెడియన్‌ అలీ ఇంటిని ఎప్పుడైనా చూశారా? | Comedian Ali Wife Zubeda Shares Home Tour | Sakshi
Sakshi News home page

Ali: కమెడియన్‌ అలీ 'హోమ్‌ టూర్‌' వీడియో

Sep 19 2021 3:19 PM | Updated on Sep 19 2021 5:59 PM

Comedian Ali Wife Zubeda Shares Home Tour - Sakshi

Ali Home Tour: యూట్యూబ్‌.. ఇప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని వాళ్లకు కూడా బోలెడంత పాపులారిటీ తెచ్చి పెడుతుంది. ఒకే ఒక్క వీడియోతో అటు డబ్బుతో పాటు బోలెడంత అభిమానం కూడా సొంతం చేసుకోవచ్చు. అందుకే సెలబ్రిటీలు సైతం సొంతంగా యూట్యూబ్‌ చానెల్స్‌ పెడుతున్నారు. క్రియేటివ్‌ వీడియోస్‌తో ఎంటర్‌టైన్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు యూట్యూబ్‌ చానెల్స్‌తో సత్తా చాటుతున్నారు.

తాజాగా కమెడియన్‌ అలీ భార్య జుబేదా సైతం యూట్యూబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  తన ఇంటికి సంబంధించి ‘మై హోమ్‌ టూర్‌’ పేరుతో ప్రోమో వీడియోను రిలీజ్‌ చేసింది. ఇందులో  హాలు, డైనింగ్‌ ఏరియా, నమాజ్‌ ఏరియా, స్విమ్మింగ్‌ పూల్‌, జిమ్‌  వంటి సౌకర్యాలతో ఉన్న జుబేదా అలీ ఇల్లు మొత్తం ఎలా ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. త్వరలోనే పూర్తి వీడియో రిలీజ్‌ కానుంది. అప్పటివరకు ప్రోమోపై ఓ లుక్కేయండి. 

Advertisement
 
Advertisement
Advertisement