ఇదేం విడ్డూరం.. విడుదలైన రెండేళ‍్లకు థియేటర్లలో రిలీజ్ | Colour Photo Movie Team Plan To Release In Theatres After 2 Years | Sakshi
Sakshi News home page

Colour Photo Movie: రెండేళ్ల తర్వాత థియేటర్లలో కలర్ ఫోటో.. కారణం అదేనా?

Oct 24 2022 9:24 PM | Updated on Oct 24 2022 9:27 PM

Colour Photo Movie Team Plan To Release In Theatres After 2 Years - Sakshi

సుహాస్, చాందిని చౌదరి నటించిన చిత్రం 'కలర్ ఫోటో'. నేరుగా ఓటీటీలో రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ సొంత చేసుకుంది. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ అవార్డు వరించింది.  ఉత్తమ తెలుగు చిత్రంగా ‘కలర్‌ ఫోటో’ అవార్డు గెలుచుకుంది.  ఒక చిన్న సినిమా జాతీయ అవార్డును అందుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు థియేటర్లలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ఏర్పా ట్లు చేస్తోంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

(చదవండి: ‘కలర్‌ ఫోటో’కు జాతీయ అవార్డు.. స్పందించిన హీరో సుహాస్‌)

 జాతీయ అవార్డు దక్కించుకున్న చిత్రం కావడంతోనే థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందని దర్శక, నిర్మాతలు ఓ నిర్ణయానికి  వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీల్లో ప్రసారమైన ఈ చిత్రాన్ని ఎవరు చూస్తారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సందీప్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఓటీటీలో విడుదలై ఇప్పటికే రెండేళ్లు పూర్తి కావొస్తోంది. వచ్చేనెల  19న కలర్ ఫోటో సినిమాను బాక్సాఫీస్‌ బరిలో నిలవనుంది. థియేటర్లలో రిలీజ్ చేస్తే మరింత గుర్తింపు దక్కుతుందని చిత్రబృదం భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో నటించిన చాందిని చౌదరి, సుహాస్‌కు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి.  ఈ విషయాన్ని కథానాయిక చాందిని చౌదరి సైతం ట్విటర్ ద్వారా వెల్లడించింది. 

Advertisement
 
Advertisement
Advertisement